Kamareddy Dist.: ఏటీఎం, పాన్ కార్డ్స్, పాస్ పోర్టులతో ఉడాయించిన పోస్ట్ మాన్
ABN , First Publish Date - 2023-04-14T15:42:12+05:30 IST
కామారెడ్డి జిల్లా: ఓ పోస్టు మాన్ (Postman) నిర్వాకం వల్ల పలువురు అన్యాయానికి గురయ్యారు. కామారెడ్డి జిల్లా (Kamareddy Dist.) కేంద్రంలోని తపాల కార్యాలయం (Post Office)లో పోస్టు మాన్గా...
కామారెడ్డి జిల్లా: ఓ పోస్టు మాన్ (Postman) నిర్వాకం వల్ల పలువురు అన్యాయానికి గురయ్యారు. కామారెడ్డి జిల్లా (Kamareddy Dist.) కేంద్రంలోని తపాల కార్యాలయం (Post Office)లో పోస్టు మాన్గా విధులు నిర్వహిస్తున్న సీతారామారావు (Sitaramarao).. కార్యాలయానికి వచ్చిన ఏటీఎం (ATM), పాన్ కార్డ్స్ (PAN Cards), పాస్ పోర్టులతో (Passports) ఉడాయించాడు. వినియోగదారులకు వస్తువులను ముట్టజెప్పకుండానే డెలివరీ షీట్లో నకిలీ సంతకాలను చేయించుకుని పరారయ్యాడు. అనుమానంతో స్థానిక పోస్టుమాస్టర్కు బాధితులు ఫిర్యాదు చేశారు. అనారోగ్యంవల్ల కొద్ది రోజుల నుంచి సీతారామారావు విధులకు హాజరుకావడంలేదని పోస్టుమాస్టర్ సురేష్ తెలిపారు. సదరు పోస్టు మాన్ గురించి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళతానని సురేష్ తెలిపారు.