KA Paul: రైతులు ఆత్మహత్య చేసుకోకండి.. నేను మీ తరపున ఉన్నా

ABN , First Publish Date - 2023-01-07T13:39:02+05:30 IST

కామారెడ్డి నూతన మాస్టర్‌ ప్లాన్‌ కారణంగా రైతు ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధాకరమని ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏపాల్ అన్నారు.

KA Paul: రైతులు ఆత్మహత్య చేసుకోకండి.. నేను మీ తరపున ఉన్నా

కామారెడ్డి: కామారెడ్డి నూతన మాస్టర్‌ ప్లాన్‌ కారణంగా రైతు ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధాకరమని ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏపాల్ (Prajashanti party Chief KA Paul) అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. రైతులకు మంచి రోజులు వచ్చాయని.. ఆత్మహత్య చేసుకోవద్దని కోరారు. మోదీ ప్రభుత్వం రైతులకు ఏమీ చేయడం లేదని విమర్శించారు. ‘‘నేను మీ తరఫున ఉన్నా.. కలెక్టర్‌ను కలిశా. రైతులకు వ్యతిరేకంగా ప్లాన్ ఉండదు. నాదీ హామీ.. దీన్ని రాజకీయం చేయద్దు. ఎవరో రెచగొట్టారని రెచ్చిపోవద్దు. రైతులను ఆదుకోవడానికి పార్టీ పెట్టాను. పదిరోజుల్లో అనుకూలంగా నిర్ణయం రాకపోతే నేనే ధర్నాకు కూర్చుంటా’’ అంటూ కేఏపాల్ తెలిపారు.

Updated Date - 2023-01-07T13:39:03+05:30 IST