Vidyasagar Rao: చంద్రబాబుపై అన్యాయంగా అక్రమ కేసులు

ABN , First Publish Date - 2023-09-12T15:08:57+05:30 IST

దేశంలో రాజకీయ నేతలకు మార్గదర్శిగా తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు(Chandrababu Naidu) ఉన్నారని తెలంగాణ రాష్ట్ర కమ్మ వారి రాజకీయ ఐక్య వేదిక కన్వీనర్, రిటైర్డ్ ప్రొఫెసర్ విద్యాసాగర్‌రావు(Vidyasagar Rao) వ్యాఖ్యానించారు.

Vidyasagar Rao: చంద్రబాబుపై  అన్యాయంగా అక్రమ కేసులు

నిజామాబాద్ జిల్లా: దేశంలో రాజకీయ నేతలకు మార్గదర్శిగా తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు(Chandrababu Naidu) ఉన్నారని తెలంగాణ రాష్ట్ర కమ్మ వారి రాజకీయ ఐక్య వేదిక కన్వీనర్, రిటైర్డ్ ప్రొఫెసర్ విద్యాసాగర్‌రావు(Vidyasagar Rao) వ్యాఖ్యానించారు. చంద్రబాబు అక్రమ అరెస్ట్‌ను తీవ్రంగా ఖండించారు. మంగళవారం నాడు డిచ్‌పల్లి మండలం ధర్మారం (బి) గ్రామంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. చంద్రబాబు అక్రమ అరెస్టుపై రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టేందుకు, తదుపరి కార్యక్రమాలపై రెండు రోజుల్లో కార్యచరణ రూపొందిస్తాం. ఆంధ్రప్రదేశ్ సైకో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు సుపరిపాలనతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి చేశారు. చంద్రబాబుపై కక్ష తీర్చుకునేందుకు జగన్‌రెడ్డి(Jagan Reddy) ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలు జగన్‌కు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. 14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబుపై అక్రమ కేసులు బనాయించడం అన్యాయం.రాజకీయ పార్టీలు హుందాగా రాజకీయాలు చేయాలి.. చివరికి ధర్మం, న్యాయం గెలుస్థాయని విద్యాసాగర్‌రావు పేర్కొన్నారు.

Updated Date - 2023-09-12T15:12:27+05:30 IST