Karnataka: రిసార్ట్ రాజకీయాలు లేవు.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు విధేయులన్న డీకే శివ కుమార్
ABN , First Publish Date - 2023-12-02T08:54:03+05:30 IST
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల(Telangana Assembly Elections 2023) ఫలితాలు రేపు వెలువడనున్న వేళ కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్(DK Shivakumar) కీలక వ్యాఖ్యలు చేశారు.
బెంగళూరు: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల(Telangana Assembly Elections 2023) ఫలితాలు రేపు వెలువడనున్న వేళ కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్(DK Shivakumar) కీలక వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
అయితే ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి రిసార్ట్ రాజకీయాలు చేసే అవసరం కాంగ్రెస్(Congress)కు లేదన్నారు. తమ ఎమ్మెల్యేలు పార్టీకి విధేయులని అందులో ఎలాంటి అనుమానాలు పెట్టుకోవద్దని చెబుతున్నారు.
డీకే మాట్లాడుతూ.. "2014లో తెలంగాణ ఏర్పడిననాటి నుంచి బీఆర్ఎస్ ను ఓడించాలని కాంగ్రెస్ గట్టిగా ప్రయత్నిస్తోంది. 119 అసెంబ్లీ స్థానాలున్న తెలంగాణలో కాంగ్రెస్ ఈ సారి ఈజీగా మ్యాజిక్ ఫిగర్ దాటి అధికారం చేపడుతుందని ఎగ్జిట్ పోల్స్(Exit Polls) చెబుతున్నాయి. గెలిచిన ఎమ్మెల్యేలను రిసార్ట్ లకు తరలిస్తామనే వార్తలు వదంతులే కానీ అందులో నిజం లేదు. సీఎం కేసీఆర్ ఇప్పటికే పలువురు కాంగ్రెస్ నేతలను సంప్రదిస్తున్నట్లు తెలుస్తోంది. కానీ మా ఎమ్మెల్యేలు పార్టీకి విధేయులు. ఎట్టి పరిస్థితిలో ప్రలోబాలకు లొంగరు. ఎగ్జిట్ పోల్స్ అన్ని తెలంగాణలో కాంగ్రెస్ విక్టరీ సాధిస్తుందని వెల్లడించాయి. వ్యక్తిగతంగా నాకు ఎగ్జిట్ పోల్స్ పై నమ్మకం లేదు. నేను సొంతంగా సర్వేలు చేసినప్పుడు లక్షకుపైగా శాంపిళ్లు తీసుకుంటాను. మీడియా చేసే శాంపిల్ సైజు కేవలం 5 - 6 వేలలోపే ఉంటుంది. తెలంగాణ, మధ్యప్రదేశ్ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. మధ్యప్రదేశ్ లో ఉన్న అవినీతి సర్కార్ ని సాగనంపాలని ప్రజలు నిర్ణయించుకున్నారు. అక్కడి బీజేపీ ప్రభుత్వం ప్రజలను మోసం చేసింది. తెలంగాణ సీఎం కేసీఆర్(CM KCR)కి గుడ్ బై చెప్పే టైం వచ్చేసింది" అని అన్నారు.
కర్ణాటక ఎలక్షన్లలో కాంగ్రెస్ విజయం సాధించడంలో డీకే కీలక పాత్ర పోషించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. డీకే తాజా కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.