Hyderabad Rains : హైదరాబాద్‌లో బాలుడి ఘటన మరువక ముందే మరో విషాదం

ABN , First Publish Date - 2023-09-05T21:48:59+05:30 IST

హైదరాబాద్‌లో భారీ వర్షాలు (Heavy Rains) బీభత్సం సృష్టిస్తున్నాయి. కుండపోత వర్షాలతో లోతట్టు ప్రాంతాలన్ని జలమయం అయ్యాయి. దీంతో ఆ ప్రాంతంలోని ప్రజలు బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు...

Hyderabad Rains : హైదరాబాద్‌లో బాలుడి ఘటన మరువక ముందే మరో విషాదం

హైదరాబాద్‌లో భారీ వర్షాలు (Heavy Rains) బీభత్సం సృష్టిస్తున్నాయి. కుండపోత వర్షాలతో లోతట్టు ప్రాంతాలన్ని జలమయం అయ్యాయి. దీంతో ఆ ప్రాంతంలోని ప్రజలు బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. నిన్న ఓ మహిళ నాలాలో గల్లంతు కావడం, ఇవాళ ప్రగతి నగర్‌లో నాలుగేళ్ల చిన్నారి నాలాలో పడి చనిపోవటంతో ఈ ఘటనలతో ఆయా కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ రెండు ఘటనలు మరువక ముందే హైదరాబాద్‌లో (Hyderabad Rains) కురిసిన భారీ వర్షాలు మరో విషాదాన్ని మిగిల్చాయి. గత రెండ్రోజులుగా నగరంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఎక్కడ చూసినా నాలాలు వరద నీటితో పొంగిపొర్లుతున్నాయి. దీంతో ఎక్కడ అడుగు పెడితే ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఆ ప్రాంత ప్రజలు భయంతో బతుకుతున్నారు.


Boy-death.jpg

ఏం జరిగింది..?

నగరంలోని బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మాధవి నగర్‌లో విషాదం చోటుచేసుకుంది. మంగళవారం ఉదయం నుంచి కురుస్తున్న వర్షానికి ఫిరోజ్‌గూడలోని మాధవి నగర్‌లో ఇండ్లలోకి వర్షపు నీరు వచ్చి చేరింది. వర్షం తగ్గడంతో ఇంట్లో ఉన్న నీటిని తొలగించిన నిషాద్ బేగం ఇంట్లో ఫ్యాన్స్ స్విచ్ వేసే క్రమంలో విద్యుత్ షాక్ తగిలి మృత్యువాత పడింది. ఇది గమనించిన స్థానికులు హుటాహుటిన స్థానికంగా ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న బాలానగర్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి పోలీసులు తరలించారు. ఈ ఘటనతో బేగం కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.

heavy-rains-telangana.jpg

Updated Date - 2023-09-05T21:48:59+05:30 IST