Maoist Party: పోలీసుల కౌన్సెలింగ్‌లను వ్యతిరేకించండి: మావోయిస్ట్ అరుణ

ABN , First Publish Date - 2023-04-10T20:09:41+05:30 IST

మావోయిస్టు కుటుంబ సభ్యులకు పోలీసులు ఇస్తున్న కౌన్సెలింగ్‌ను వ్యతిరేకించాలని మావోయిస్టు పార్టీ (Maoist Party) భద్రాద్రి జిల్లా చర్ల ఏరియా కమిటీ కార్యదర్శి అరుణ

Maoist Party: పోలీసుల కౌన్సెలింగ్‌లను వ్యతిరేకించండి: మావోయిస్ట్ అరుణ

చర్ల: మావోయిస్టు కుటుంబ సభ్యులకు పోలీసులు ఇస్తున్న కౌన్సెలింగ్‌ను వ్యతిరేకించాలని మావోయిస్టు పార్టీ (Maoist Party) భద్రాద్రి జిల్లా చర్ల ఏరియా కమిటీ కార్యదర్శి అరుణ (Aruna) కోరారు. సోమవారం ఆమె మీడియాకు ఓ లేఖను విడుదల చేశారు. ఈనెల 6న చర్ల పోలీస్‌ స్టేషన్‌ (Police station)లో ఎస్పీ 16మంది మావోయిస్టు కుటుంబాల సభ్యులతో కౌన్సెలింగ్‌ ఏర్పాటు చేశారని, పిల్లల్ని సరెండర్‌ చేయించాలని, రివార్డు, ఇళ్లు, భూములు ఇస్తామని అనేక రకాలుగా ప్రలోభపెట్టారని అరుణ ఆ లేఖలో ఆరోపించారు. లొంగిపోయిన వారికి ప్రభుత్వం నుంచి అన్నిరకాలుగా సౌకర్యాలు కల్పిస్తామని చెబుతూ, వారిని ఇన్‌ఫార్మర్‌లుగా తయారు చేసి వారి చావుకు కారణమవుతున్నారని ఆరోపించారు.

అలాగే ఎర్రంపాడు, బూరుగుపాడు, కొండెవాయి, కిష్టారం పాడు, రాళ్లపురం, బట్టిగూడెం, చెన్నాపురం, కొర్కట్‌పాడు ఆదివాసీ గ్రామాలను ఇప్పటి వరకు రెవిన్యూ గ్రామాలుగా గుర్తించక పోగా విద్యార్థులకు కుల, ఆదాయం ధ్రువీకరణ పత్రాలు, ఆదివాసీలు సాగు చేసుకున్న పోడు భూములకు పట్టాలు ఇవ్వలేదని ఆరోపించారు. కూబింగ్‌ల పేరులో గ్రామాలను జల్లెడ పడుతూ, సంతకాల పేరుతో ప్రజలను పోలీస్‌స్టేషన్‌కు పిలిచి ఇబ్బందులు పెడుతున్నారన్నారు. ఇక పోలీసులు ఇచ్చే కౌన్సెలింగ్‌లు కొత్తవేమీ కాదని అరుణ ఆ లేఖలో పేర్కొన్నారు.

Updated Date - 2023-04-10T20:09:41+05:30 IST