Modi telangana visit: మహబూబ్‌నగర్ చేరుకున్న ప్రధాని మోదీ..
ABN , First Publish Date - 2023-10-01T14:17:53+05:30 IST
మహబూబ్‌నగర్‌లో చేపట్టనున్న పలు అభివృద్ధి కార్యక్రమాలు, భారీ బహిరంగ సభలో పాల్గొనేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్ చేరుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం తరపున మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రధానికి స్వాగతం పలికారు.
హైదరాబాద్: పలు అభివృద్ధి కార్యక్రమాలు, భారీ బహిరంగ సభలో పాల్గొనేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మహబూబ్‌నగర్ చేరుకున్నారు. తొలుత హైదరాబాద్ చేరుకున్న ఆయన ప్రత్యేక హెలికాప్టర్‌లో మహబూబ్‌నగర్ చేరుకున్నారు. కాగా శంషాబాద్ ఎయిర్‌పోర్టులో తెలంగాణ ప్రభుత్వం తరపున మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రధానికి స్వాగతం పలికారు. స్వాగతం పలికిన వారిలో గవర్నర్ తమిళిసైతోపాటు పలువురు అధికారులు ఉన్నారు. కాగా పాలమూరు ప్రజాగర్జన సభలో తెలంగాణకు గిరిజన యూనివర్సిటీని మోదీ ప్రకటించనున్నారు. అంతకుముందు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు.
శంషాబాద్ ఎయిర్‌పోర్టు దగ్గర టీటీడీపీ శ్రేణుల నిరసన
మోదీ తెలంగాణ పర్యటన నేపథ్యంలో శంషాబాద్ ఎయిర్‌పోర్టు దగ్గర టీటీడీపీ శ్రేణుల నిరసన తెలిపాయి. చంద్రబాబు అరెస్ట్‌ను వ్యతిరేకిస్తూ ఎయిర్‌పోర్టులో నిరసన తెలిపారు. ప్రధాని మోదీ ఏపీలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ మాజీ ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసూన బ్యానర్ ప్రదర్శించారు. చంద్రబాబు అక్రమ అరెస్ట్‌పై ప్రధాని స్పందించాలని విజ్ఞప్తి చేశారు. ఏపీలో జరుగుతున్న అప్రజాస్వామిక ఘటనలపై ప్రధాని దృష్టిసారించాలని కాట్రగడ్డ ప్రసూన డిమాండ్ చేశారు. స్కిల్ డెవలప్‌మెంట్ అక్రమ కేసులో మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో టీటీడీపీ శ్రేణులు ఈవిధంగా నిరసన తెలిపాయి.