PM Narendra Modi Live Updates: బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు దళిత విరోధులు.. ప్రజలు జాగ్రత్తగా ఉండాలి
ABN , First Publish Date - 2023-11-11T16:16:30+05:30 IST
PM Narendra Modi in Telangana Live Updates: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న సందర్భంగా బీజేపీ వరుసగా బహిరంగ సభలు నిర్వహిస్తోంది. ఎన్నికల షెడ్యూల్ కంటే ముందు మహబూబ్‌నగర్, నిజామాబాద్ జిల్లాలలో పర్యటించిన ప్రధాని మోదీ కొద్దిరోజుల కింద హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో బహిరంగ సభకు హాజరయ్యారు. తాజాగా ఆయన మరోసారి తెలంగాణలో పర్యటించనున్నారు. ఈ మేరకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో బీజేపీ ఆధ్వర్యంలోని ‘అణగారిన వర్గాల విశ్వరూప మహాసభ’లో..
Live News & Update
-
2023-11-10T19:00:00+05:30
మాదిగల వర్గీకరణ కోసం త్వరలో కమిటీ- మోదీ
- మాదిగల వర్గీకరణ కోసం త్వరలో కమిటీ: ప్రధాని మోదీ
- మాదిగలకు న్యాయం జరిగేలా చూస్తా: మోదీ
- ఎస్సీ వర్గీకరణ అంశానికి కట్టుబడి ఉన్నాం: మోదీ
- మీ పోరాటంలో న్యాయం ఉందని భావిస్తున్నాం: మోదీ
- మీ హక్కుల సాధనలో మా తరపున సంపూర్ణ మద్దతు ఇస్తాం: మోదీ
- వర్గీకరణకు చట్టపరంగా ఇబ్బందులు లేకుండా చేస్తాం: మోదీ
-
2023-11-10T19:00:00+05:30
బంగారు లక్ష్మణ్ నుంచి ఎంతో నేర్చుకున్నా-మోదీ
- రైతుల కోసం వరికి మద్దతు ధర పెంచాం: మోదీ
- రైతుల నుంచి 20 లక్షల టన్నుల బాయిల్డ్ రైస్ కొనుగోలు చేస్తాం
- బియ్యం కొనుగోళ్లకు ఎన్నికల కోడ్ అడ్డురాదు: మోదీ
- తెలంగాణ ప్రభుత్వం రైతులకు అన్యాయం చేయవద్దు: మోదీ
- మాదిగల బిడ్డ బంగారు లక్ష్మణ్ నేతృత్వంలో పనిచేశా: మోదీ
- ఓ కార్యకర్తగా బంగారు లక్ష్మణ్ నుంచి ఎంతో నేర్చుకున్నా: మోదీ
- తెలంగాణలో మాదిగలకు జరుగుతున్న అన్యాయం కలిచివేస్తోంది: మోదీ
- మందకృష్ణ ఆశయాలకు అనుగుణంగా నేను మీతో కలిసి పనిచేస్తా: మోదీ
- 30 ఏళ్లుగా పోరాటం చేస్తున్న మందకృష్ణ నిజమైన యోధుడు: మోదీ
-
2023-11-10T19:00:00+05:30
లిక్కర్ స్కాంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల ప్రమేయం-మోదీ
- తెలంగాణ అస్థిత్వాన్ని BRS ప్రభుత్వం కాపాడలేకపోయింది
- ఇరిగేషన్ స్కీంలను ఇరిగేషన్ స్కామ్‌లుగా మార్చారు: మోదీ
- ఢిల్లీలో ఆప్‌తో కలిసి బీఆర్‌ఎస్ అవినీతికి పాల్పడింది: మోదీ
- లిక్కర్ స్కామ్‌లో రెండుపార్టీల ప్రమేయం ఉంది: మోదీ
- కాంగ్రెస్, బీఆర్‌ఎస్ అంటేనే అవినీతికి నిదర్శనం
- బీఆర్‌ఎస్, కాంగ్రెస్ రెండు పార్టీలూ కలిసే ఉన్నాయి: మోదీ
- ఒకరిపై ఒకరు పోటీ చేస్తున్నట్లు నటిస్తున్నారు
- ఆ రెండు పార్టీల టార్గెట్ బీజేపీనే: ప్రధాని మోదీ
-
2023-11-10T18:45:00+05:30
గిరిజన మహిళను రాష్ట్రపతి చేశాం-మోదీ
- కొత్త రాజ్యాంగం పేరుతో అంబేద్కర్‌ను కేసీఆర్ అవమానించారు
- కాంగ్రెస్ అంబేద్కర్‌ను ఎన్నికల్లో రెండుసార్లు ఓడించారు
- కాంగ్రెస్ పార్లమెంట్‌లో అంబేడ్కర్ చిత్రపటం కూడా పెట్టలేదు
- అంబేద్కర్‌కు భారతరత్న కూడా కాంగ్రెస్ ఇవ్వలేదు: మోదీ
- మేం వచ్చాకే అంబేద్కర్ ఫొటో పెట్టాం.. భారతరత్న ఇచ్చాం
- గిరిజన మహిళను రాష్ట్రపతి చేసిన ఘనత బీజేపీదే-మోదీ
-
2023-11-10T18:45:00+05:30
దళితులను కేసీఆర్ మోసం చేశారు-మోదీ
- తెలంగాణ పోరాటంలో అన్ని వర్గాలు పాల్గొన్నాయి: మోదీ
- అధికారంలో వచ్చాక బీఆర్‌ఎస్ అందరినీ విస్మరించింది
- ఎన్నో బలిదానాల తర్వాత తెలంగాణ ఏర్పడింది: మోదీ
- దళితుడిని సీఎం చేస్తానన్న కేసీఆర్ మాట తప్పారు: మోదీ
- దళితుల సీఎం కూర్చీని కేసీఆర్ కబ్జా చేశారు: మోదీ
- మాదిగ సామాజికవర్గాన్ని కూడా విస్మరించారు: మోదీ
- తెలంగాణ అస్థిత్వాన్ని బీఆర్‌ఎస్ కాపాడలేకపోయింది
- దళిత బంధుతో మాదిగలకు న్యాయం జరగలేదు: మోదీ
- 3 ఎకరాల భూమి హామీని బీఆర్‌ఎస్ నిలబెట్టుకోలేదు: మోదీ
- బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు దళిత విరోధులు: మోదీ
- ఆ రెండు పార్టీలతో దళితులు జాగ్రత్తగా ఉండాలి: మోదీ
-
2023-11-10T18:30:00+05:30
మాదిగల పోరాటానికి సంపూర్ణ మద్దతు-ప్రధాని మోదీ
- మాదిగల పోరాటానికి మా సంపూర్ణ మద్దతు: మోదీ
- వన్ లైఫ్, వన్ విషన్‌లా మందకృష్ణ పోరాటం చేశారు
- 30 ఏళ్ల మాదిగల పోరాటానికి నా సంపూర్ణ మద్దతు: మోదీ
- స్వాతంత్ర్యం వచ్చాక అనేక ప్రభుత్వాలను చూశారు: మోదీ
- గత ప్రభుత్వాలకు, మా ప్రభుత్వానికి తేడా గమనించాలి
- సబ్‌కా సాథ్.. సబ్‌కా వికాస్.. అనేది మా విధానం: మోదీ
- సామాజిక న్యాయం చేసేందుకు మేం కట్టుబడి ఉన్నాం: మోదీ
-
2023-11-10T17:15:00+05:30
తెలుగులో ప్రసంగం ప్రారంభించిన ప్రధాని మోదీ
- అణగారిన వర్గాల విశ్వరూప మహాసభపై తెలుగులో ప్రసంగం ప్రారంభించిన ప్రధాని మోదీ
- భారత్ మాతా కీ జై అంటూ ప్రధాని మోదీ ప్రసంగం
- సమ్మక్క-సారలమ్మ, యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులతో ఈ సభకు వచ్చిన వారికి శుభాకాంక్షలు-మోదీ
- తెలంగాణ మాదిగ సమాజానికి అభినందనలు: ప్రధాని మోదీ
- మందకృష్ణ మాదిగ.. నా చిన్న తమ్ముడు: ప్రధాని మోదీ
- ఎంతో ప్రేమతో ఈ సభకు నన్ను ఆహ్వానించారు: ప్రధాని మోదీ
- స్వాతంత్ర్యం వచ్చాక అనేక ప్రభుత్వాలను చూశారు
- ఆ ప్రభుత్వాలకు.. మా ప్రభుత్వానికి తేడా గమనించాలి
- సామాజికి న్యాయానికి బీజేపీ కట్టుబడి ఉంది: మోదీ
-
2023-11-10T18:00:00+05:30
మోదీ మాట ఇస్తే తప్పరు- మందకృష్ణ
- ప్రధాని మోదీ గుండె గట్టిది.. మనసు మాత్రం వెన్నపూస: మందకృష్ణ
- మోదీని మించిన నాయకుడు లేరు.. భవిష్యత్తులో రారు
- మోదీ మాట ఇస్తే తప్పరని ప్రజల్లో బాగా విశ్వాసం ఉంది: మందకృష్ణ
- తమిళనాడులో ఎన్నికల్లో ఓడిన మురుగన్‌ను కేంద్రమంత్రి చేశారు
- ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు తీసుకొచ్చిన ఘనత మోదీదే
- ఎస్సీలో మాదిగలకు అన్యాయం జరుగుతోంది: మందకృష్ణ
- 30 ఏళ్లుగా రిజర్వేషన్ కోసం పోరాడుతున్నాం: మందకృష్ణ
- మాదిగలకు అన్యాయం జరిగిందని అనేక కమిషన్లు చెప్పాయి
- విద్య, ఉద్యోగ, రాజకీయాల్లో అన్యాయం జరుగుతోంది: మందకృష్ణ
- ఎస్సీ వర్గీకరణ జరిగితేనే అంత్యోదయ ఫలాలు అందుతాయి
- మోదీని మించిన నాయకుడు లేరు.. భవిష్యత్తులో రారు: మందకృష్ణ
- మోదీ మాట ఇస్తే తప్పరని ప్రజల్లో బాగా విశ్వాసం ఉంది: మందకృష్ణ
- వర్గీకరణ చేస్తే దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీకి అండగా ఉంటాం
- పార్టీలకు అతీతంగా మాదిగలంతా మోదీకి అండగా ఉందాం: మందకృష్ణ
-
2023-11-10T18:00:00+05:30
కేబినెట్‌లో ఒక్క మాదిగ మంత్రి కూడా లేరు: మందకృష్ణ
- ఈ సభకు ప్రధాని మోదీ వస్తారని మేం ఊహించలేదు: మందకృష్ణ
- దళిత, గిరిజన బిడ్డలను రాష్ట్రపతులను చేసిన ఘనత ప్రధాని మోదీదే
- తెలంగాణకు బీసీని సీఎంగా చేస్తామని ప్రకటించింది బీజేపీనే
- మోదీకి సామాజిక స్పృహ ఉంది కనుకే మా సభకు వచ్చారు
- బలహీనవర్గాల కష్టాలు ప్రధాని మోదీకి బాగా తెలుసు
- ఈ సమాజం మమ్మల్ని మనుషులుగా చూడలేదు: మందకృష్ణ
- మాదిగలను ఇప్పుడిప్పుడే చైతన్యపరుస్తున్నాం: మందకృష్ణ
- కాంగ్రెస్, బీఆర్ఎస్ కేవలం మాటలే చెబుతున్నాయి: మందకృష్ణ
- కేబినెట్‌లో ఒక్క మాదిగ మంత్రి కూడా లేరు: మందకృష్ణ
- తక్కువ జనాభా ఉన్న కులాలకు ఎక్కువ మంత్రి పదవులు ఇచ్చారు
- కర్ణాటక నుంచి నారాయణస్వామిని కేంద్రమంత్రిని చేసిన ఘనత మోదీదే: మందకృష్ణ
- బలహీనవర్గాలకు అండగా ఉండే పార్టీ బీజేపీనే: మందకృష్ణ
-
2023-11-10T17:45:00+05:30
ఎస్సీల సమావేశానికి మోదీ రావడమే మన విజయం: కిషన్‌రెడ్డి
ఎస్సీల సమావేశానికి మోదీ రావడమే మనం సాధించిన తొలి విజయం: కిషన్ రెడ్డి
మందకృష్ణ మాదిగ 30 ఏళ్లుగా పోరాటం చేస్తున్నారు: కిషన్‌రెడ్డి
అన్ని వర్గాలకు న్యాయం జరగాలని అంబేద్కర్ చెప్పారు
అన్ని వర్గాలకూ ఫలాలు అందాలనేదే మా పార్టీ విధానం: కిషన్‌రెడ్డి
మందకృష్ణ మాదిగను అనేక రకాలుగా బెదిరించారు: కిషన్‌రెడ్డి
-
2023-11-10T17:30:00+05:30
విశ్వరూప మహాసభకు చేరుకున్న ప్రధాని మోదీ
- పరేడ్ గ్రౌండ్స్ బహిరంగ సభకు చేరుకున్న ప్రధాని మోదీ, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, మందకృష్ణ మాదిగ, బండి సంజయ్
- మహాసభ వేదికపై కంటతడి పెట్టిన మందకృష్ణ మాదిగ
- మందకృష్ణ మాదిగను భుజం తట్టి ఓదార్చిన ప్రధాని మోదీ
-
2023-11-10T17:15:00+05:30
హైదరాబాద్ చేరుకున్న ప్రధాని మోదీ
- బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న ప్రధాని మోదీ
- కాసేపట్లో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌కు చేరుకోనున్న ప్రధాని మోదీ
- పరేడ్ గ్రౌండ్స్‌లో ‘అణగారిన వర్గాల విశ్వరూప మహాసభ’లో పాల్గొననున్న మోదీ
-
2023-11-10T16:30:00+05:30
20 నిమిషాలు ఆలస్యంగా రానున్న మోదీ
- 20 నిమిషాలు ఆలస్యంగా హైదరాబాద్‌కు నరేంద్రమోదీ
- 5.05 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకోనున్న నరేంద్రమోదీ
- ముందుగా 4.45 గంటలకు షెడ్యూల్ చేసిన PMO
- PMO షెడ్యూల్ చేసిన సమయం 20 నిమిషాల ఆలస్యంగా షెడ్యూల్
- 5.25 గంటలకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌కు నరేంద్రమోదీ
- 40 నిమిషాల పాటు పరేడ్ గ్రౌండ్స్‌లో ఉండనున్న నరేంద్రమోదీ
-
2023-11-10T16:15:00+05:30
హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు
ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా సికింద్రాబాద్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని పోలీసులు వెల్లడించారు. శనివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఈ ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. పంజాగుట్ట-గ్రీన్‌ల్యాండ్, బేగంపేట నుంచి సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ వరకు, టివోలి ఎక్స్ రోడ్స్, ప్లాజా ఎక్స్ రోడ్ల మధ్య రోడ్లను మూసివేసినట్లు పేర్కొన్నారు. బేగంపేట నుంచి సంగీత్ ఎక్స్ రోడ్స్ వైపు వెళ్లే వాహనదారులు సీటీవో ఎక్స్ రోడ్స్ వద్ద బాలమ్ రాయ్, బ్రూక్‌బాండ్, తివోలి, స్వీకార్ ఉపకార్, వైఎంసీఏ, సెయింట్ జాన్సన్ రోటరీ మీదుగా వెళ్లాలని సూచించారు.
-
2023-11-10T16:00:00+05:30
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న సందర్భంగా బీజేపీ వరుసగా బహిరంగ సభలు నిర్వహిస్తోంది. ఎన్నికల షెడ్యూల్ కంటే ముందు మహబూబ్‌నగర్, నిజామాబాద్ జిల్లాలలో పర్యటించిన ప్రధాని మోదీ కొద్దిరోజుల కింద హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో బహిరంగ సభకు హాజరయ్యారు. తాజాగా ఆయన మరోసారి తెలంగాణలో పర్యటించనున్నారు. ఈ మేరకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో బీజేపీ ఆధ్వర్యంలోని ‘అణగారిన వర్గాల విశ్వరూప మహాసభ’లో ప్రధాని మోదీ పాల్గొని ప్రసంగించనున్నారు. తెలంగాణలో మాదిగ సామాజికవర్గం ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. వాళ్లు ఎప్పటినుంచో రిజర్వేషన్‌ల కోసం పోరాడుతున్నారు. ప్రధాని మోదీ ఈ అంశంపై ప్రకటన చేస్తారేమోనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.