ponguleti: పొంగులేటి సంచలన కామెంట్స్.. ప్రజలు బీఆర్ఎస్‏కు బుద్ధిచెప్పడం పక్కా..

ABN , First Publish Date - 2023-08-29T11:51:52+05:30 IST

బీఆర్‌ఎస్‌ నాయకుల అహంకారానికి ప్రజలు తగిన సమయంలో బుద్ధి చెబుతారని కాంగ్రెస్‌ ప్రచార కమిటీ కోకన్వీనర్‌ పొంగులేటి శ్రీనివాసరెడ్డి

ponguleti: పొంగులేటి సంచలన కామెంట్స్.. ప్రజలు బీఆర్ఎస్‏కు బుద్ధిచెప్పడం పక్కా..

ఖమ్మం: బీఆర్‌ఎస్‌ నాయకుల అహంకారానికి ప్రజలు తగిన సమయంలో బుద్ధి చెబుతారని కాంగ్రెస్‌ ప్రచార కమిటీ కోకన్వీనర్‌ పొంగులేటి శ్రీనివాసరెడ్డి(Ponguleti Srinivasa Reddy) హెచ్చరించారు. సోమవారం 54వ డివిజన్‌ కార్పొరేటర్‌ మిక్కిలినేని మంజుల ఆధ్వర్యంలో టీడీపీ ఆఫీస్‌ సమీపంలో జరిగిన నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. 60అడుగులు వెడల్పు ఉన్న రహదారిలో ఐదుఅడుగుల వెడల్పుతో సీసీరోడ్డు నిర్మాణం సరైంది కాదని, ఎంతో రద్దీగా ఉండే రహదారి భవిష్యత్‌లో ప్రభుత్వ శాఖల అధికారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతారని ఈ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఖమ్మంలోని టీడీపీ సెంటర్‌లో ఎక్సైజ్‌శాఖ, పోలీసుశాఖలు, కూరగాయల మార్కెట్‌ , ఇతర కార్యాలయాలు ఉండటంతో రహదారి ఎప్పుడు రద్దీగా ఉంటుందన్నారు. సోమవారం మధ్యాహ్నం నుంచి రాత్రివరకు ధర్నా చేపట్టారు. టీపీసీసీ సభ్యుడు, నగర కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఎండీ జావీద్‌ ధర్నాలో పాల్గొని మాట్లాడారు. స్థానిక కార్పొరేటర్‌కు సమాచారం ఇవ్వకుండా సీసీ రోడ్డును నిర్మాణం చేస్తున్నారని నినాదాలు చేశారు. కార్పొరేటర్‌ రఫీదాబేగం, మలీదు జగన్‌, కాంగ్రెస్‌ నాయకులు తుళ్లూరి బ్రహ్మయ్య, తుంబూరు దయార్‌రెడ్డి మిక్కిలినేని నరేంద్ర, పల్లెబోయిన చంద్ర, బాణాల లక్ష్మణ్‌, విప్లవ్‌కుమార్‌, సత్తార్‌, నరాల నరేశ్‌, మోగలయ్య, ఏలూరి రవికుమార్‌, కొయిని వెంకన్న, వీరబాబు, సాయి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-08-29T11:51:53+05:30 IST