Praja Darbar: ప్రతి శుక్రవారం ప్రజా దర్బార్.. వేదిక ప్రజా భవన్
ABN , First Publish Date - 2023-12-07T21:21:56+05:30 IST
Revanth Reddy: ప్రమాణ స్వీకారం చేస్తూ రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ప్రగతి భవన్ ఇనుప కంచెలు బద్దలు కొట్టామని.. శుక్రవారం ఉదయం అక్కడ ప్రజా దర్బార్ నిర్వహిస్తామని చెప్పారు. ప్రగతి భవన్ పేరుని జ్యోతిరావు పూలే ప్రజా భవన్‌గా మారుస్తున్నట్లు ప్రకటించారు.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరింది. సీఎంగా రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎంగా మల్లు భట్టివిక్రమార్క, మంత్రులు ప్రమాణం చేశారు. ప్రమాణ స్వీకారం చేస్తూ రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ప్రగతి భవన్ ఇనుప కంచెలు బద్దలు కొట్టామని.. శుక్రవారం ఉదయం 10 గంటలకు అక్కడ ప్రజా దర్బార్ నిర్వహిస్తామని చెప్పారు. ప్రగతి భవన్ పేరుని జ్యోతిరావు పూలే ప్రజా భవన్‌గా మారుస్తున్నట్లు ప్రకటించారు. ఇకపై ప్రజా భవన్‌కు ఎవరైనా రావొచ్చు అని.. ఎలాంటి ఆంక్షలు ఉండవని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛ లభించిందని, ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకే ఇందిరమ్మ రాజ్యం వచ్చిందని రేవంత్ రెడ్డి చెప్పారు. ప్రజా ప్రభుత్వం ఏర్పాటుతో సమాన అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు రేవంత్ రెడ్డి. తెలంగాణను దేశంలోని ఇతర రాష్ట్రాలతోనే కాదని, ప్రపంచంతోనే పోటీపడేలా చేస్తానన్నారు. కాగా ప్రజా దర్బార్ ప్రతి శుక్రవారం నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ప్రజా దర్బార్ ద్వారా ప్రజల ఫిర్యాదులను స్వీకరించి వెంటనే పరిష్కరించేలా సీఎం రేవంత్ చర్యలు చేపట్టనున్నట్లు కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.