Modi telanagana visit: తెలంగాణలో ప్రధాని మోదీ మినిట్ టు మినిట్ షెడ్యూల్ ఇదే..

ABN , First Publish Date - 2023-10-01T08:09:33+05:30 IST

హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) తెలంగాణలో ఆదివారం కీలక పర్యటన చేయనున్నారు. మధ్యాహ్నం 1:30 గంటల సమయంలో ఆయన శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ చేరుకోనున్నారు. 1:35 గంటలకు శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో మహబూబ్‌నగర్‌కు బయలు దేరుతారు.

Modi telanagana visit: తెలంగాణలో ప్రధాని మోదీ మినిట్ టు మినిట్ షెడ్యూల్ ఇదే..

హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) తెలంగాణలో ఆదివారం కీలక పర్యటన చేయనున్నారు. మధ్యాహ్నం 1:30 గంటల సమయంలో ఆయన శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ చేరుకోనున్నారు. 1:35 గంటలకు శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో మహబూబ్‌నగర్‌కు బయలు దేరుతారు. 2:10 గంటలకు మహబూబ్‌నగర్ హెలిప్యాడ్‌ వద్దకు చేరుకుంటారు.


2:15 నుండి 2:50 వరకు మహబూబ్‌నగర్‌లో వివిధ అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు చేస్తారు. 3 గంటలకు బహిరంగ సభ వేదిక వద్దకు మోదీ చేరుకుంటారు. 4:00 గంటల వరకు ఆయన బహిరంగ సభ వద్దే ఉంటారు. 4:10 గంటలకు మహబూబ్‌నగర్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు బయలుదేరి వెళ్తారు. 4:45 శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ చేరుకుంటారు. 4:50 గంటలకు శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ తిరుగు ప్రయాణమవుతారు.


వరాల జల్లు..!

తెలంగాణ శాసనసభకు మరికొద్ది రోజుల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాష్ట్ర పర్యటనకు వస్తున్న ప్రధాని మోదీ ఇక్కడి ప్రజలపై వరాలు కురిపించబోతున్నారని బీజేపీ ముఖ్యనేతలు చెబుతున్నారు. ఎన్నికల దృష్ట్యా మోదీ కీలక ప్రకటన చేయబోతున్నారని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ప్రధాని రెండు జిల్లాల పర్యటనల సందర్భంగా రూ.21 వేల కోట్లకుపైగా అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. ఇవి కాకుండా, ఆయన మరికొన్ని కీలక ప్రకటనలు చేసే అవకాశం ఉందని పార్టీ నేతలు పేర్కొంటున్నారు. ప్రధాని మోదీ, కేవలం ఒక్కరోజు వ్యవధిలో రెండుసార్లు రాష్ట్ర పర్యటనకు వస్తున్నారంటే, తెలంగాణను పార్టీ అధినాయకత్వం ఎంత సీరియస్‌గా తీసుకుందో విదితమవుతోందని చెబుతున్నారు. మోదీ ఆదివారం మహబూబ్‌నగర్‌కు, 3న నిజామాబాద్‌ జిల్లా పర్యటనకు వస్తున్న సంగతి తెలిసిందే. మహబూబ్‌నగర్‌ నుంచే ఆయన ఎన్నికల శంఖారావం పూరించబోతున్నారు. అక్కడి నుంచే రూ.13 వేల కోట్లతో చేపట్టిన పలు ప్రాజెక్టులకు ప్రా రంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. నిజామాబాద్‌ పర్యటనలో ప్రధాని మోదీ పసుపు బోర్డ్డుపై ప్రకటన చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో ప్ర చారం జరుగుతోంది. ఇక్కడి నుంచి రూ.8 వేల కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు.

Updated Date - 2023-10-01T08:12:28+05:30 IST