Share News

Revanth Reddy: రేవంత్ రెడ్డి ప్రొఫైల్

ABN , First Publish Date - 2023-12-05T20:37:13+05:30 IST

తెలంగాణ నూతన సీఎంగా రేవంత్ రెడ్డి పేరును కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఈ మేరకు కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ప్రకటించారు.

Revanth Reddy: రేవంత్ రెడ్డి ప్రొఫైల్

హైదరాబాద్: తెలంగాణ నూతన సీఎంగా రేవంత్ రెడ్డి పేరును కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఈ మేరకు కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ప్రకటించారు.

రేవంత్ రెడ్డి ప్రొఫైల్ ఇలా ఉంది.

నాగర్‌కర్నూల్ జిల్లా కొండారెడ్డిపల్లి గ్రామంలో 1969 నవంబర్ 8న రేవంత్ రెడ్డి జన్మించారు.

2006లో మిడ్జిల్ మండలం జడ్పీటీసీ సభ్యుడుగా రేవంత్ రెడ్డి విజయం సాధించారు.

2007లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా స్వాతంత్య్రంగా ఎన్నికయ్యారు.

2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం నుంచి కొడంగల్ ఎమ్మెల్యేగా గెలుపొందారు.

2014లో రెండోసారి రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు.

2014 – 17 మధ్య టీడీఎల్పీ ఫ్లోర్‌ లీడర్‌గా ఎంపిక అయ్యారు.

2017 అక్టోబర్‌లో టీడీపీకి రాజీనామా చేశారు.

2017లో కాంగ్రెస్‌ పార్టీలో చేరిక

2018లో టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఎంపిక అయ్యారు.

2018 డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు.

2019 మేలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున మల్కాజిగిరి పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధించారు.

2021లో జూన్ 26న పీసీసీ అధ్యక్ష్యుడిగా రేవంత్ ఎంపికయ్యారు.

2021 జూలై 7న టీపీసీపీ అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేశారు.

ఎల్‌.బి.స్టేడియంలో 7వ తేదీ ఉదయం 10:28 గంటలకు సీఎంగా రేవంత్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. యావత్‌ తెలంగాణ సమాజాన్ని ప్రమాణ స్వీకారానికి రేవంత్‌రెడ్డి ఆహ్వానించారు. తెలంగాణలో ఇక ప్రజాపాలన మొదలవుతుందని రేవంత్‌రెడ్డి తెలిపారు.

Updated Date - 2023-12-05T20:41:20+05:30 IST