Rains lash Hyderabad : వర్షానికి బండి ఆగిపోయిందా.. వెంటనే ఈ నంబర్‌కు వాట్సాప్ చేయండి..

ABN , First Publish Date - 2023-07-27T08:26:04+05:30 IST

వర్షాలకు వాహనాలపై బయటికి అత్యవసర పని మీద వెళ్లిన జనాలు, ఆఫీసుల నుంచి ఇంటికెళ్లే మార్గమధ్యలో వర్షానికి ఇరుక్కుపోయిన వాహనదారులకు సైబరాబాద్ పోలీసులు ఒకింత శుభవార్త చెప్పారు...

Rains lash Hyderabad : వర్షానికి బండి ఆగిపోయిందా.. వెంటనే ఈ నంబర్‌కు వాట్సాప్ చేయండి..

తెలంగాణలో వర్షాలు (Telangana Rains) దంచికొడుతున్నాయి. మరో మూడ్రోజుల పాటు ఇలాగే భారీగానే వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాల్లో అతి భారీ వర్షాలు (Very Heavy Rains) కురిసే అవకాశం ఉంది. దీంతో తెలంగాణలో రెడ్ అలర్ట్ (Red Alert) కొనసాగుతోంది. మరోవైపు.. హైదరాబాద్‌లో (Hyderabad) రాత్రి నుంచి గ్యాప్‌ లేకుండా వాన దంచికొడుతోంది. లోతట్టు ప్రాంతాల ప్రజలను జీహెచ్ఎంసీ (GHMC) అధికారులు అప్రమత్తం చేశారు. బుధవారం రాత్రి నుంచి హైదరాబాద్‌లో 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యిందని అధికారులు తెలిపారు. అయితే ఈ వర్షాలకు వాహనాలపై బయటికి అత్యవసర పని మీద వెళ్లిన జనాలు, ఆఫీసుల నుంచి ఇంటికెళ్లే మార్గమధ్యలో వర్షానికి ఇరుక్కుపోయిన వాహనదారులకు సైబరాబాద్ పోలీసులు ఒకింత శుభవార్త చెప్పారు.


Bike-Stuck-In-Rains.jpg

ఇలా చేస్తే సేఫ్..!

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో నడిరోడ్డుపై వాహనాలు మొరాయిస్తే, ట్రాఫిక్ జామ్ సమస్య పరిష్కరించేందుకు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు వినూత్న ఆలోచన చేశారు. ఇందుకోసం ఒక ప్రత్యేక ఫోన్ నంబర్‌ను ఏర్పాటు చేశారు. ఇకపై వర్షానికి బండి ఆగిపోతే వెంటనే 83339 93360 నెంబర్‌కు వాట్సప్ కాల్ చేస్తే సైబరాబాద్ పోలీసులు సహాయం చేస్తారు. ఇది సైబరాబాద్ కమిషనరేట్ పరిధి వరకు మాత్రమేనని పోలీసులు స్పష్టం చేశారు.

సాయం కోసం సంప్రదించండి..

  • మేడ్చల్ ట్రాఫిక్ డీసీపీ మాదాపూర్ ట్రాఫిక్ డీసీపీ : 87126 63011, 87126 63010

  • సైబరాబాద్ పోలీసులు వాట్సప్ నంబరు : 9490617346 ను సంప్రదించాలని సైబరాబాద్ పోలీసులు ఓ ప్రకటనలో తెలిపారు.

Updated Date - 2023-07-27T08:28:51+05:30 IST