Vikarabad Car racing: కార్ రేసింగ్‌పై జిల్లా ఎస్పీ ఏమన్నారంటే..!

ABN , First Publish Date - 2023-08-16T17:17:54+05:30 IST

అనంతగిరి అడవుల్లో జరిగిన బైక్, కార్ల రేసింగ్‌ను అధికారులు సీరియస్‌గా తీసుకున్నారు. దీంతో కార్ రేసింగ్‌పై పోలీసులు విచారణ చేపట్టారు. స్వాతంత్ర్య దినోత్సవం రోజున అడవుల్లో రేసింగ్‌లతో కొందరు యువకులు దుమ్ము రేపి అలజడి సృష్టించారు. రేసింగ్ జరిగిన ప్రాంతాన్ని అటవీ శాఖ, పోలీస్ అధికారులు పరిశీలించారు.

Vikarabad Car racing: కార్ రేసింగ్‌పై జిల్లా ఎస్పీ ఏమన్నారంటే..!

వికారాబాద్: అనంతగిరి అడవుల్లో జరిగిన బైక్, కార్ల రేసింగ్‌ను అధికారులు సీరియస్‌గా తీసుకున్నారు. దీంతో కార్ రేసింగ్‌పై పోలీసులు విచారణ చేపట్టారు. స్వాతంత్ర్య దినోత్సవం రోజున అడవుల్లో రేసింగ్‌లతో కొందరు యువకులు దుమ్ము రేపి అలజడి సృష్టించారు. రేసింగ్ జరిగిన ప్రాంతాన్ని అటవీ శాఖ, పోలీస్ అధికారులు పరిశీలించారు. అనంతగిరి అడవుల్లో ఎక్కడెక్కడా రేసింగ్ నిర్వహించే స్పాట్స్ ఉన్నాయో వాటిని పరిశీలించారు. అడవి మొత్తాన్ని ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ అధికారులు చుట్టేశారు. రేసింగ్‌లో ఎంతమంది పాల్గొన్నారు.. ఎవరు సహకరించారనే విషయాలపై ఆరా తీస్తున్నారు. రేసింగ్ నిర్వాహకులను గుర్తించి చర్యలు తీసుకునేందుకు అధికారులు సిద్ధపడుతున్నారు.

మంగళవారం కలెక్టరేట్‌లో స్వాతంత్ర్య దినోత్సవం వేడుకల్లో ఫారెస్ట్ అధికారులు, పోలీసులు బిజీగా ఉన్నారు. దీన్నిఅదునుగా చేసుకుని సుమారు 70 బైకులు, 30 కారులతో యువకులు రేసింగ్ చేపట్టారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో అధికారులు సీరియస్‌గా తీసుకున్నారు. వాహనాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్ నెంబర్ ఆధారంగా నిందితుల కోసం వేట సాగిస్తున్నారు.

ఎస్పీ సందన..

అనంతగిరి హిల్స్‌లో జరిగిన కార్ల రేసింగ్‌పై జిల్లా ఎస్పీ కోటి రెడ్డి స్పందించారు. ఇప్పటికే కొన్ని వాహనాలను గుర్తించామని.. కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. రేసింగ్‌లో ఎంతమంది పాల్గొన్నారనే దానిపై ఆరా తీస్తున్నామన్నారు. రేసింగ్ నిర్వాహకులను గుర్తించి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

Updated Date - 2023-08-16T17:17:54+05:30 IST