Karnataka Elections: కర్ణాటక వెళ్లిన రేవంత్‌రెడ్డి

ABN , First Publish Date - 2023-05-02T18:42:55+05:30 IST

కర్ణాటక (Karnataka)లో ఈనెల 10న జరగనున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరఫున ప్రచారం చేసేందుకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి (Revanth Reddy) మంగళవారం బీదర్‌ వెళ్లారు.

Karnataka Elections: కర్ణాటక వెళ్లిన రేవంత్‌రెడ్డి

హైదరాబాద్: కర్ణాటక (Karnataka)లో ఈనెల 10న జరగనున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరఫున ప్రచారం చేసేందుకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి (Revanth Reddy) మంగళవారం బీదర్‌ వెళ్లారు. ఉదయం హైదరాబాద్‌ (Hyderabad) నుంచి బయల్దేరిన ఆయన జహీరాబాద్‌లో ఆగి అల్ఫాహారం తీసుకున్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ డాక్టర్‌ జే. గీతారెడ్డి అనుచరులు ఆయనకు స్వాగతం పలికారు. నియోజకవర్గంలో పార్టీ పరిస్థితుల గురించి వారితో తెలుసుకున్న రేవంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడకుండానే బీదర్‌ వెళ్లిపోయారు. ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేతో పాటు కర్నాటక ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి పాల్గొంటారు. తెలుగు వారుండే ప్రాంతాల్లో రేవంత్‌రెడ్డి ముమ్మర ప్రచారం చేయనున్నారు. కర్నాటకలో కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధిస్తే దాని ప్రభావం తెలంగాణపైనా ఉంటుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ మేరకు ఎన్నికల పరిశీలకులుగా ఐదుగురు తెలంగాణ నేతలను ఏఐసీసీ నియమించింది. ఇందులో ఎమ్మెల్యే సీతక్క, ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్‌, టీపీసీసీ సీనియర్‌ ఉపాధ్యక్షుడు మల్లు రవి, సీనియర్‌ అధికార ప్రతినిధి బెల్లయ్య నాయక్‌, ఉపాధ్యక్షుడు ఒబేదుల్లా కొత్వాల్‌లకు చోటు కల్పించింది. ఎన్నికల ప్రచారం అనంతరం హాత్‌ సే హాత్‌ జోడో అభియాన్‌ యాత్రను రేవంత్ రెడ్డి కొనసాగిస్తారు.

Updated Date - 2023-05-02T18:42:55+05:30 IST