#RIP Gaddar : విమల సూచనతో గద్దర్ అంత్యక్రియలు అక్కడే.. రేపు సెలవు..!?

ABN , First Publish Date - 2023-08-06T20:28:50+05:30 IST

ప్రజా యుద్ధనౌక గద్దర్ (Gaddar) అలియాస్ గుమ్మడి విఠల్ ఆదివారం మధ్యాహ్నం తిరిగిరానిలోకాలకు చేరుకున్నారు. ఆయన మరణంతో అభిమానులు, కుటుంబీకులు శోకసంద్రంలో మునిగిపోయారు. అపోలో ఆస్పత్రి నుంచి భౌతికకాయాన్ని నగరంలోని ఎల్బీస్టేడియానికి (LB Stadium) తరలించారు...

#RIP Gaddar : విమల సూచనతో గద్దర్ అంత్యక్రియలు అక్కడే.. రేపు సెలవు..!?

ప్రజా యుద్ధనౌక గద్దర్ (Gaddar) అలియాస్ గుమ్మడి విఠల్ ఆదివారం మధ్యాహ్నం తిరిగిరానిలోకాలకు చేరుకున్నారు. ఆయన మరణంతో అభిమానులు, కుటుంబీకులు శోకసంద్రంలో మునిగిపోయారు. అపోలో ఆస్పత్రి నుంచి భౌతికకాయాన్ని నగరంలోని ఎల్బీస్టేడియానికి (LB Stadium) తరలించారు. ప్రజల సందర్శనార్థం ప్రస్తుతం అక్కడే ఉంచారు. సోమవారం మధ్యాహ్నం 12 గంటల వరకు స్టేడియంలోనే పార్థివదేహం ఉంచనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. 12 గంటల తర్వాత ఎల్బీ స్టేడియం నుంచి అంతిమయాత్ర కొనసాగనుంది. మరోవైపు.. కడసారి గద్దర్‌ను చూసేందుకు, నివాళులర్పించేందుకు వేలాదిగా అభిమానులు, కవులు, కళాకారులు, రాజకీయ, సినీ ప్రముఖులు తరలివస్తున్నారు.


Gaddar Death.jpeg

అంత్యక్రియలు ఎక్కడంటే..?

ఆల్వాల్‌లో గద్దర్ స్థాపించిన మహోబోధి విద్యాలయంలో (Mahabodhi School) సోమవారం నాడు అంత్యక్రియలు జరగనున్నాయి. స్కూల్ ఆవరణలోనే అంత్యక్రియలు నిర్వహించాలని ఆయన సతీమణి విమల (Gaddar Wife Vimala) సూచించిడంతో కుటుంబీకులు, కళాకారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక్కడ అంతిమ సంస్కారాలు నిర్వహించాలన్నది గద్దర్ చివరి కోరికని ఆయన తనయుడు మీడియాకు తెలిపారు. కాగా.. సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు ఎల్బీ స్టేడియం నుంచి అంతిమయాత్ర ప్రారంభం కానుంది. ఎల్బీ స్టేడియం నుంచి సికింద్రాబాద్‌ మీదుగా ఆల్వాల్‌కు అంతిమయాత్ర సాగనుంది. అనంతరం భూదేవి నగర్‌లోని గద్దర్ ఇంట్లో కొద్దిసేపు పార్థివదేహాన్ని ఉంచనున్నట్లు కుటుంబ సభ్యులు మీడియాకు వెల్లడించారు. ఇదిలా ఉంటే.. గద్దర్ అంత్యక్రియలను కేసీఆర్ సర్కార్ అధికారిక లాంఛనాలతో జరపాలని కాంగ్రెస్ నేతలు, ప్రజా సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు.

2 (8).jpeg

సెలవు..!

మరోవైపు.. గ‌ద్దర్ ఒక ప్రాంతానికి చెందిన వారు కాదని.. ప్రపంచ వ్యాప్తంగా ప్రభావం చేసిన యోధుడని కవులు, కళాకారులు ఆయన సేవలను కొనియాడుతున్నారు. ఇన్నేళ్ల పాటు బ‌త‌క‌డానికి కార‌ణం ప్రజ‌ల మీద ఉన్న ప్రేమ త‌ప్ప మ‌రొక‌టి కాద‌ని చెబుతున్నారు. ఆయుధం అంటే ఆలోచ‌న‌, ఆయుధం అంటే పాట‌, ఆయుధం అంటే ఓటు అని ప్రజా సంఘాల నేతలు చెబుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం సోమవారం నాడు సెలవు ప్రకటించాలని సోషల్ మీడియా ద్వారా కవులు, కళాకారులు డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు.. ఈ తరం పిల్లలకు గద్దర్ గురించి తప్పకుండా తెలియాలని.. పాఠ్యాంశాల్లో చేర్చాలనే డిమాండ్ కూడా వస్తోంది. మరోవైపు.. సెలవు డిమాండ్‌పై ప్రభుత్వం సమాలోచనలు చేస్తున్నట్లు తెలియవచ్చింది. అయితే సెలవు ప్రకటిస్తేనే బాగుటుందనే యోచనలో కేసీఆర్ ఉన్నట్లు సమాచారం. రాత్రి 10 గంటలలోపు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు, సెలవుపై కీలక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

CM-KCR-On-Gaddar.jpg


ఇవి కూడా చదవండి


Gaddar Passes Away : ప్రజా యుద్ధనౌక గద్దర్ కన్నుమూత.. అరుదైన ఫొటోలు


TS Politics : అసెంబ్లీలో కేసీఆర్ ఎన్నికల హామీలు.. అన్నీ శుభవార్తలే చెప్పిన సీఎం!


TSRTC Merger Bill : ఆర్టీసీ విలీన బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం



Updated Date - 2023-08-06T20:30:54+05:30 IST