Road Accident: బందోబస్తుకు వెళ్తూ ఎస్ఐ మృతి.. అయినా కాన్వాయ్ ఆపని ఎస్ఐబీ చీఫ్

ABN , First Publish Date - 2023-05-02T16:41:51+05:30 IST

జీడివాగు దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది.

Road Accident: బందోబస్తుకు వెళ్తూ ఎస్ఐ మృతి.. అయినా కాన్వాయ్ ఆపని ఎస్ఐబీ చీఫ్

ములుగు: జీడివాగు దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. అదుపుతప్పి పోలీస్ వాహనం (Police vehicle) బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఏటూరునాగారం ఎస్ఐ ఇంద్రయ్య సహా డ్రైవర్ రమేష్ మృతి చెందారు. ఏటూరునాగారం - కమలాపురం రహదారిలో ఈ ఘటన జరిగింది. ఎస్ఐబీ చీఫ్ పర్యటన దృష్ట్యా బందోబస్తుకు వెళ్తుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది. ప్రమాద స్థలం దగ్గర నుంచే ఎస్ఐబీ (SIB) చీఫ్ ప్రభాకరణ్‌ వెళ్లారు. ఎస్ఐ చనిపోయాడని తెలిసినా కాన్వాయ్ ఆపకుండా ఎస్ఐబీ చీఫ్ అక్కడి నుంచి వెళ్లిపోయారు.

ములుగు ఏజెన్సీలో పోలీసులు హైఅలెర్ట్ ప్రకటించారు. ఇటీవల ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం దంతేవాడలో జరిగిన బాంబు బ్లాస్ట్ నేపథ్యంలో ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలోని వెంకటాపురం పోలీస్ స్టేషన్‌లో పోలీస్ ఉన్నతాకారులు సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షాసమావేశానికి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (SIB) చీఫ్ ప్రభాకరన్, వరంగల్ రేంజ్ ఐజీ నాగిరెడ్డి, సీఆర్పీఎఫ్ చీఫ్, ఇతర పోలీస్ ఉన్నత అధికారులు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో భారీగా సీఆర్పీఎఫ్ బలగాలను మోహరించారు. మావోయిస్టులు తెలంగాణలోకి చొరబడకుండా పోలీసులు చర్యలు చేపట్టారు.

Updated Date - 2023-05-02T17:30:01+05:30 IST