Rs.92.34 crores: ఎన్నికల కోడ్ నేపథ్యంలో.. రూ.92.34 కోట్లు సీజ్
ABN , First Publish Date - 2023-12-02T08:29:22+05:30 IST
న్నికల కోడ్ నేపథ్యంలో హైదరాబాద్ జిల్లా(Hyderabad district) పరిధిలో నిర్వహించిన తనిఖీల్లో భారీగా నగదు పట్టుబడింది. షెడ్యూ ల్ విడుదలైన
హైదరాబాద్ సిటీ, (ఆంధ్రజ్యోతి): ఎన్నికల కోడ్ నేపథ్యంలో హైదరాబాద్ జిల్లా(Hyderabad district) పరిధిలో నిర్వహించిన తనిఖీల్లో భారీగా నగదు పట్టుబడింది. షెడ్యూ ల్ విడుదలైన అనంతరం నగరంలోని పలు ప్రాంతాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటుచేసి వాహనాలు తనిఖీ చేశారు. ఈ క్రమంలో శుక్రవారం ఫ్లయింగ్ స్క్వాడ్ రూ.5,225 నగదు సీజ్ చేసింది. ఫ్లయింగ్ స్క్వాడ్, పోలీస్ అధికారులు ఇప్పటి వరకు మొత్తం రూ.92.34 కోట్లు సీజ్ చేసినట్టు హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రోస్ తెలిపారు. దీనికి సంబంధించి 1,057 కేసులు నమోదు చేసినట్టు పేర్కొన్నారు. అనుమతి లేకుండా సమావేశాలు నిర్వహించినందుకు 155 ఫిర్యాదులు అందాయని, వాహనాల దుర్వినియోగానికి సంబంధించి 42 కేసులు నమోదయ్యాయని చెప్పారు.