ఢిల్లీ పోలీసుల కస్టడీకి సంధ్య కన్వెన్షన్ ఎండీ శ్రీధర్‌రావు
ABN , First Publish Date - 2023-02-20T19:40:47+05:30 IST
సంధ్య కన్వెన్షన్ ఎండీ శ్రీధర్‌రావు (Sandhya Convention MD Sridhar Rao)ను ఢిల్లీ పోలీసుల కస్టడీకి తీసుకున్నారు. శ్రీధర్‌రావును 3 రోజుల పాటు కస్టడీ (Custody)లోకి తీసుకెళ్లేందుకు..
హైదరాబాద్: సంధ్య కన్వెన్షన్ ఎండీ శ్రీధర్‌రావు (Sandhya Convention MD Sridhar Rao)ను ఢిల్లీ పోలీసుల కస్టడీకి తీసుకున్నారు. శ్రీధర్‌రావును 3 రోజుల పాటు కస్టడీ (Custody)లోకి తీసుకెళ్లేందుకు ఢిల్లీ పోలీసులు రాజేంద్రనగర్ కోర్టును ఆశ్రయించారు. వాదనలు విన్న కోర్టు పోలీసులకు అనుమతిచ్చింది. ఢిల్లీ తీసుకెళ్లిన వెంటనే కోర్టులో హాజరుపర్చాలని న్యాయస్థానం సూచించింది. కోర్టు అనుమతివ్వడంతో శ్రీధర్‌రావును ఢిల్లీ పోలీసులు తీసుకెళ్లారు. అమితాబచ్చన్ బంధువు నుంచి శ్రీధర్ ఏకంగా రెండున్నర కోట్ల రూపాయలు తీసుకున్నారు. అమితాబచ్చన్ బంధువులు ఢిల్లీ (Delhi)లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ట్రాక్టర్లు ఇప్పిస్తానని చెప్పి రూ. 2.5 కోట్ల మేర అమితాబ్ బంధువుల నుంచి తీసుకున్నారు. శ్రీధర్ చేతిలో మోసపోయామని తెలుసుకున్న బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో శ్రీధర్‌ను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. శ్రీధర్‌రావుపై 406,407,408,409,468,120బీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇప్పటికి శ్రీధర్ అరెస్ట్ కావడం నాలుగోసారి కావడం గమనార్హం.
మోసాలకు పాల్పడటం శ్రీధర్ రావుకు కొత్తేమీ కాదు
ఇలా మోసాలకు పాల్పడటం సంధ్యా కన్వెన్షన్ ఎండీ శ్రీధర్ రావుకు కొత్తేమీ కాదు. గతంలో కూడా తెలంగాణలో పలువురిని ఇదే తరహాలో మోసగించారు. గతంలో శ్రీధర్‌పై నార్సింగ్, రాయదుర్గం, సనత్ నగర్‌లో కేసులు నమోదయ్యాయి. గత ఏడాది గబ్చిబౌలిలో ఈవెంట్ మేనేజర్‌పై శ్రీధర్ దాడి చేసి హైలైట్ అయ్యారు. దాడి చేస్తున్న సీసీటీవీ దృశ్యాలు బయటికి రావడంతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అప్పటి నుంచి ఆయన అరాచకాలు ఒక్కొక్కటికీ బయటకు వచ్చాయి. చాలా కంప్లైంట్స్ వెల్లువెత్తాయి. అరెస్ట్ అవ్వడం, బెయిల్‌పై బయటికి రావడం శ్రీధర్‌కి అలవాటుగా మారిపోయిందనే చర్చ నడుస్తోంది.