Home » Custody
మాజీ ఎంపీ, ప్రస్తుత ఏపీ ఉప సభాపతి రఘురామ కృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో అప్పటి సీఐడీ డీఐజీగా పనిచేసిన సునీల్ నాయక్‌కు ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ నోటీసులు ఇచ్చారు. సోమవారం ఒంగోలు ఎస్పీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు జారీ చేశారు.
వైఎస్సార్‌సీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పోలీసుల విచారణలో నోరు విప్పడంలేదు. మూడో రోజు విచారణ నిమిత్తం పోలీసులు వంశీని అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి కీలక సమాచారం రాబట్టేలా ఆధారాలతో సహా పోలీసులు ప్రశ్నలు సిద్ధం చేశారు.
కోర్టు తనకు బెయిలు మంజూరు చేసినప్పటికీ, ఎలాంటి తప్పిదాలు చేయరాదని ఆ ఆదేశాల్లో రాసి ఉందని, దీంతో బెయిల్ ఆర్డర్‌ను తోసిపుచ్చానని, జైలుకు వెళ్లేందుకు అంగీకరించానని ప్రశాంత్ కిషోర్ తెలిపారు.
ఎక్సైజ్ కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ జ్యుడిషియల్ కస్టడీని సెప్టెంబర్ 2వ తేదీ వరకూ ఢిల్లీ కోర్టు మంగళవారంనాడు పొడిగించింది.
నెల్లూరు: పోలింగ్ రోజున పల్నాడు జిల్లా, రెంటచింతల మండలం, పాలువాయి గేటు పోలింగ్ కేంద్రానికి తాను వెళ్లలేదని, ఈవీఎం పగులగొట్టలేదని, అసలు నంబూరి శేషగిరిరావు ఎవరో తనకు తెలియదని, ఆరోజు తన వెంట గన్ మెన్ కూడా లేరని, పోలీసుల విచారణలో మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఇచ్చిన సమాధానాలివి.
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ఆప్ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ జ్యుడిషియల్ కస్టడీని రౌస్ అవెన్యూ కోర్టు జూలై 3వ తేదీ వరకూ బుధవారంనాడు పొడిగించింది. ఆయనతో పాటు కేసులో మరో నిందితుడు వినోద్ చౌహాన్ జ్యుడిషియల్ కస్టడీని సైతం జూలై 3 వరకూ కోర్టు పొడిగించింది.
కస్టడీలో ఉన్న ప్రముఖ సినీ నటుడు దర్శన్(Film actor Darshan) సహా నిందితులను పోలీసులు విచారిస్తున్నారు. చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి(Renukaswamy) హత్య కేసులో పలు కోణాలు వెలుగులోకి వస్తున్నాయి.
హైదరాబాద్: హైదరాబాద్: తెలంగాణ లో గొర్రెల స్కామ్ దర్యాప్తులో ఏసీబీ అధికారులు స్పీడ్ పెంచారు. నిందితులను ఏసీబీ కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. రెండవరోజు మంగళవారం మాజీ పశు సంవర్ధక శాఖ ఎండీ రాంచందర్ నాయక్, ఓఎస్డీ కళ్యాణ్‌లను విచారిస్తున్నారు.
ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ స్వాతి మలివాల్ పై దాడి కేసులో ఆరోపణలు ఎదుర్కొటున్న ముఖ్యమంత్రి కేజ్రీవాల్ వ్యక్తిగత సహాయకుడు బిభవ్ కుమార్ కు 3 రోజుల పోలీసు కస్టడీకి ఢిల్లీ తీజ్ హజారీ కోర్టు మంగళవారంనాడు ఆదేశించింది.
ప్రముఖుల అరెస్టులతో దేశవ్యాప్తంగా రాజకీయ ప్రకంపనలు రేపుతున్న ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు ఈడీ కస్టడీకి అనుమతించింది. మరోవైపు బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ కవిత ఈడీ కస్టడీ ఈరోజుతో ముగియనుంది.