BRS MLA Victim: ఢిల్లీలో పోరాటాన్ని కొనసాగిస్తున్న దుర్గం చిన్నయ్య బాధితురాలు

ABN , First Publish Date - 2023-06-13T15:13:31+05:30 IST

బెల్లంపల్లి ఎమ్మెల్యే బాధితురాలు ఆరిజన్ డైరీ ప్రతినిధి శేజల్ దేశరాజధాని ఢిల్లీలో తన పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. ఢిల్లీ తెలంగాణ భవన్‌లో కేసీఆర్ చిత్రపటానికి శేజల్ పాలాభిషేకం చేశారు. అనంతరం శేజల్ మీడియాతో మాట్లాడుతూ.. బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై సీఎం కేసీఆర్ చర్యలు తీసుకోవాలని కోరారు.

BRS MLA Victim: ఢిల్లీలో పోరాటాన్ని కొనసాగిస్తున్న దుర్గం చిన్నయ్య బాధితురాలు

న్యూఢిల్లీ: బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య (Bellamapalli MLA Durgam Chinnayya) బాధితురాలు ఆరిజన్ డైరీ ప్రతినిధి శేజల్ (Origin Dairy representative Sejal) దేశరాజధాని ఢిల్లీలో తన పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. ఢిల్లీ తెలంగాణ భవన్‌లో కేసీఆర్ (CM KCR) చిత్రపటానికి శేజల్ పాలాభిషేకం చేశారు. అనంతరం శేజల్ మీడియాతో మాట్లాడుతూ.. బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై సీఎం కేసీఆర్ చర్యలు తీసుకోవాలని కోరారు. దశబ్ది ఉత్సవాలలో భాగంగా మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలపై లైంగిక వేధింపులు చేసిన చిన్నయ్యని సస్పెండ్ చెయ్యాలని శేజల్ డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ మహిళా సంక్షేమం కోసం ఎన్నో చేస్తున్నారని.. కానీ తమకు జరిగిన అన్యాయంపై పోరాడుతుంటే ముఖ్యమంత్రి స్పందించడం లేదన్నారు. దుర్గం చిన్నయ్యపై పోలీసులు చర్యలు తీసుకోవడం లేదని ఆమె మండిపడ్డారు.

నిరసన తెలపడంతో భాగంగా పాలాభిషేకం చేసినట్లు తెలిపారు. పాలాభిషేకంతో న్యాయం జరుగుతుందన్న నమ్మకం లేదన్నారు. ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ప్రభుత్వ భూమిని తన భూమంటూ తమకు అమ్మడంతో పాటు లైంగికంగా తనను వేధించారని ఆరోపించారు. ఎమ్మెల్యే దగ్గరకు వెళ్లాలంటూ పోలీసులు తనపై ఒత్తిడి తెచ్చారని తెలిపారు. బెల్లంపల్లి పోలీసులు దొంగలకు సపోర్ట్ చేస్తున్నారని మండిపడ్డారు. మూడు రోజుల పాటు అక్రమంగా కిడ్నాప్ చేసి ఆధారాలు తీసుకుని, తమపై తప్పుడు కేసులు పెట్టి వేధించారని ఆవేదన వ్యక్తం చేశారు. కేసులు ఎవరు పెట్టకపోయినా తమను అదుపులోకి తీసుకుని ఎమ్మెల్యే చెప్పినట్లు చేయాలంటూ సీఐ బాబురావు, ఎస్సై రాజశేఖర్, ఆంజనేయులు బెదిరించారని తెలిపారు. తెలంగాణాలో ఫిర్యాదులు చేస్తే ఎవరు పట్టించుకోలేదని.. అందుకే సీబీఐని ఆశ్రయించామన్నారు. కోర్టుకు వెల్దామనుకుంటే పోలీస్ స్టేషన్‌లోనే తమను బెదిరించారన్నారు. ఈ పోరాటంలో కుటుంబ సభ్యుల మద్దతు తనకు ఉందని శేజల్ పేర్కొన్నారు.

Updated Date - 2023-06-13T15:19:19+05:30 IST