Sharmila: మంత్రి ఎర్రబెల్లి, ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌పై షర్మిలారెడ్డి ఫైర్‌.. ఒళ్లు దగ్గర పెట్టుకుని..

ABN , First Publish Date - 2023-02-17T19:23:17+05:30 IST

తన పాదయాత్రతో ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌కు భయంపట్టుకుందని షర్మిల ఆరోపించారు. శంకర్‌నాయక్ బెదిరించే ధోరణితో మాట్లాడుతున్నారని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు.

Sharmila: మంత్రి ఎర్రబెల్లి, ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌పై షర్మిలారెడ్డి ఫైర్‌..  ఒళ్లు దగ్గర పెట్టుకుని..

మహబూబాబాద్‌: టీఆర్ఎస్ ఎమ్మెల్యే శంకర్‌నాయక్ (Shankar Naik), తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ (Minister Errabelli )పై వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిలారెడ్డి (Sharmila) ఫైర్‌ అయ్యారు. తన పాదయాత్రతో ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌కు భయంపట్టుకుందని షర్మిల ఆరోపించారు. శంకర్‌నాయక్ బెదిరించే ధోరణితో మాట్లాడుతున్నారని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆడదానివై ఉండి ఎలా మాట్లాడుతున్నావని ఎర్రబెల్లి అంటున్నారని, ఆడవారు అయితే మాట్లాడకూడదా?, ఆడవారికి గొంతు లేదా? అని షర్మిల ప్రశ్నించారు. ఎర్రబెల్లి దయాకర్‌ ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని షర్మిల హెచ్చరించారు.

అంతకు మీడియాతో మాట్లాడుతూ రేవంత్‌, షర్మిలను ఉద్దేశిస్తూ ఎమ్మెల్యే శంకర్‌నాయక్ పరోక్ష వ్యాఖ్యలు చేశారు. భూమికి మూరెడు ఎత్తులేనివారు కూడా కేసీఆర్‌ను విమర్శిస్తున్నారని మండిపడ్డారు. స్వప్రయోజనాలకై రాష్ట్రంలో వలసవాదుల పర్యటనలు చేస్తున్నారని శంకర్‌నాయక్ విమర్శించారు. పర్యటనలు చేసుకోండి కానీ నోరు అదుపులో పెట్టుకోండి అని శంకర్‌నాయక్ అన్నారు. లేదంటే మానుకోట కంకర రాళ్లకు పనిచెబుతామని ఎమ్మెల్యే శంకర్‌నాయక్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణ రాష్ట్రంలో షర్మిల పాదయాత్ర చేస్తున్నారు. ఈ రోజుతో షర్మిల చేపట్టిన పాదయాత్ర 238వ రోజుకు చేరుకుంది. పాలకుర్తి, తొర్రూర్ నియోజకవర్గాల్లో ఆమె పర్యటించారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో పాలకుర్తి నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పథకాల గురించి వివరించారు. దేవాదుల కాలువల ద్వారా చెరువులకు నీళ్లు నింపారని గుర్తు చేశారు. వేలాదిమందికి ఇందిరమ్మ ఇళ్లను కట్టించారని చెప్పారు.

తెలంగాణ రాష్ట్రంలో ఇంకొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఏడాడి ఆగస్టు-సెప్టెంబర్ మధ్య ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఎన్నికల వేడి పతాక స్థాయికి చేరుకుంటోంది. అన్నిపార్టీలు ప్రజలతో మమేకం అవుతోన్నాయి. టీఆర్ఎస్.. భారత్ రాష్ట్ర సమితిగా ఆవిర్భవించిన తరువాత ఎదుర్కొనబోతోన్న తొలి ఎన్నికలు ఇవే కావడంతో బీఆర్ఎస్ దీన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది.

ఈ వార్తలు కూడా చదవండి

*****************************

కాన్వాయ్‌ దిగి కాలినడకన అనపర్తికి చంద్రబాబు

**********************

నాగ చైతన్య సినిమాలో చీఫ్ మినిస్టర్ గా

***********************************************

Updated Date - 2023-02-17T19:30:16+05:30 IST