Sirisha Murder Case: శిరీష హత్యకేసులో అసలు నిజాలు వెల్లడించిన ఎస్పీ

ABN , First Publish Date - 2023-06-14T20:54:13+05:30 IST

తెలంగాణ (Telangana) రాష్ట్రంలో సంచలనం సృష్టించిన విద్యార్థిని శిరీష హత్య కేసుకు (Sirisha Murder Case) సంబంధించి ఎస్పీ కోటిరెడ్డి కీలక వివరాలు వెల్లడించారు. ముడు రోజులు దర్యాప్తు జరిపి శిరీష హత్య కేసు ఛేదించామని ఎస్పీ తెలిపారు. శిరీష‌ను హతమార్చింది బావ అనిల్ అని నిర్ధారణ అయ్యిందన్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు అనిల్ అని తెలిపారు. ఈ నెల 11న హత్య కేసు 302 నమోదు చేసి.. దర్యాప్తు చేసామని ఎస్పీ వివరించారు.

Sirisha Murder Case: శిరీష హత్యకేసులో అసలు నిజాలు వెల్లడించిన ఎస్పీ

వికారాబాద్: తెలంగాణ (Telangana) రాష్ట్రంలో సంచలనం సృష్టించిన విద్యార్థిని శిరీష హత్య కేసుకు (Sirisha Murder Case) సంబంధించి ఎస్పీ కోటిరెడ్డి కీలక వివరాలు వెల్లడించారు. ముడు రోజులు దర్యాప్తు జరిపి శిరీష హత్య కేసు ఛేదించామని ఎస్పీ తెలిపారు. శిరీష‌ను హతమార్చింది బావ అనిల్ అని నిర్ధారణ అయ్యిందన్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు అనిల్ అని తెలిపారు. ఈ నెల 11న హత్య కేసు 302 నమోదు చేసి.. దర్యాప్తు చేసామని ఎస్పీ వివరించారు. శిరీష‌ను పెళ్లి చేసుకోవాలని, శారీరకంగా అనుభవించాలని నిందితుడు అనిల్‌కు కోరిక ఉందన్నారు. సెల్ ఫోన్ గురించి ఇంట్లో గొడవ జరిగిందని, ఆ రోజు శిరీష అనిల్‌ను తిట్టిందని తెలిసిందన్నారు.

‘‘శిరీష అందరిని మభ్య పెట్టి గడియ పెట్టి రాత్రి ఇంటి నుంచి బయటకు వెళిపోయింది. ఈ నెల 11 న శిరీష తమ్ముడు అక్క శ్రీలతకు ఫోన్ చేసి శిరీష కనపడటం లేదని చెప్పాడు. కట్ట మైసమ్మ టెంపుల్ వద్ద శిరీషను అనిల్ గమనించాడు. తాగిన మైకంలో శిరీషను రాత్రి 11:30 గంటల సమయంలో దారుణంగా బీర్ బాటిల్‌తో కొట్టాడు. రెండు కళ్లలో పొడిచాడు. నిందితుడు అనిల్‌పై గతంలో ఐపీసీ సెక్షన్ 307, 2015 పరిగి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదయింది. శిరీష‌ను కొట్టి నీటిలో బలవంతంగా ముంచి హతమార్చాడు. అనంతరం కాళ్లు చేతులు కడుక్కొని శిరీష కోసం ఏమి తెలియనట్లు వెతికాడు. నిందితుడు అనిల్ నేరాన్ని అంగీకరించాడు. ఒక్కడే ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. రాజు అనే వ్యక్తి పై నేరాన్ని నెట్టాలని అనిల్ ప్రయత్నించాడు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా నిందితుడికి శిక్ష పడేలా దర్యాప్తు చేస్తాము. శిరీష తండ్రిని ప్రశ్నించాము’’ అని ఎస్పీ కోటిరెడ్డి వివరంగా చెప్పుకొచ్చారు.

Updated Date - 2023-06-14T21:07:43+05:30 IST