Srinivas Goud: దొంగసర్వేలతో కాంగ్రెస్ నేతలు ప్రజలను అయోమయానికి గురిచేస్తున్నారు.. ఎగ్జిట్ పోల్స్ అన్ని బూటకం
ABN , First Publish Date - 2023-12-01T18:47:33+05:30 IST
కాంగ్రెస్ నేతలపై మంత్రి శ్రీనినాస్ గౌడ్ విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ దొంగసర్వేలు, దొంగ హామీలతో ప్రజలను అయోమయానికి గురిచేస్తున్నారని మండిపడ్డారు. ఎగ్జిట్ పోల్స్ అన్ని బూటకమని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మహబూబ్ నగర్: కాంగ్రెస్ నేతలపై మంత్రి శ్రీనినాస్ గౌడ్ విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ దొంగసర్వేలు, దొంగ హామీలతో ప్రజలను అయోమయానికి గురిచేస్తున్నారని మండిపడ్డారు. ఎగ్జిట్ పోల్స్ అన్ని బూటకమని ఆగ్రహం వ్యక్తం చేశారు.
"2018లో కూడా ఇలాగే హంగామా, హైపు చేశారు. కాంగ్రెస్ కుల రాజకీయాలు, బీజేపీ మత రాజకీయాలు చేశారు. నీచ, స్వార్ద రాజకీయాలతో పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారు. 3వ తేదీన తప్పకుండా కేసీఆర్ మూడవ సారి సీఎం కావటం ఖాయం. తొమ్మిదిన్న ఏళ్లలో చేసిన అభివృద్ధితో తాము గెలుస్తున్నాం. అన్ని వర్గాలకు మేలు చేసిన నేత కేసీఆర్. రేవంత్ రెడ్డి కుల రాజకీయాలతో ప్రజలను విడగొట్టాలని చూశారు. గెలిచిన ఎమ్మెల్యేలను హైదరాబాద్‌లో పెట్టుకోలేని స్థితిలో కాంగ్రేస్ పార్టీ ఉంది. డీకే శినకుమార్ చేతిలో రాష్ట్ర కాంగ్రెస్ నేతలు కీలుబొమ్మలుగా మారారు. ఈ రాష్ట్రానికి కేసీఆర్ పాలనే శ్రీరామ రక్ష. కేసీఆర్ లేని తెలంగాణను ఇక్కడి ప్రజలు ఊహించలేరు. రాష్ట్రంలో హంగ్ వచ్చే పరిస్థితి లేదు. బీఆర్ఎస్ దే మూడోసారి విజయం తధ్యం." అని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు.