TDP Chief: తెలంగాణలో పోటీ చేసే స్థానాల సంఖ్యపై చంద్రబాబు క్లారిటీ

ABN , First Publish Date - 2023-08-29T15:40:46+05:30 IST

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై టీడీపీ దృష్టిసారించింది. అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరించేందుకు ఇప్పటికే ఏడుగురు సభ్యులతో కమిటీనీ నియమించిన టీడీపీ అధినేత.. తాజాగా తెలంగాణలో పోటీ చేసే స్థానాలపై స్పష్టత ఇచ్చారు.

TDP Chief: తెలంగాణలో పోటీ చేసే స్థానాల సంఖ్యపై చంద్రబాబు క్లారిటీ

న్యూఢిల్లీ: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై (Telangana Assembly Elections) టీడీపీ (TDP) దృష్టిసారించింది. అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరించేందుకు ఓ కమిటీని నియమించిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (TDP Chief Chandrababu naidu).. తాజాగా తెలంగాణలో పోటీ చేసే స్థానాల సంఖ్యపై స్పష్టత ఇచ్చారు. మంగళవారం ఢిల్లీలో మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో టీడీపీ అధినేత మాట్లాడుతూ.. తెలంగాణలో అన్ని స్థానాల్లో పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే పోటీపై కమిటీ వేశామని చెప్పారు. తెలంగాణలో బీజేపీతో (BJP) పొత్తు ఉంటుందా అన్న ప్రశ్నకు సమయం మించిపోయిందని చంద్రబాబు సమాధానం ఇచ్చారు.


ఏపీని పునర్నిర్మించాలనే ఆలోచన...

టీడీపీ అధినేత చంద్రబాబు ఇంకా మాట్లాడుతూ... ఏపీని ఎలా పునర్నిర్మించాలన్న ఆలోచనలో తాను ఉన్నట్లు తెలిపారు. బీజేపీతో అంతర్గతంగా ఏం చర్చిస్తున్నామనేది ఎవరికీ తెలియదన్నారు. తాను చూడని రాజకీయం లేదని.. దేశ నిర్మాణంలో భాగం కవాలన్నది తన ఉద్దేశ్యమని తెలిపారు. అది ఎలా అనేది కాలం నిర్ణయిస్తుందన్నారు. ప్రత్యేక హోదా కోసమే ఎన్డీయే నుంచి బయటకు వచ్చినట్లు చెప్పుకొచ్చారు. ప్రత్యేక హోదా ప్రజల సెంటిమెంట్ అని అన్నారు. జగన్ ఏపీని సర్వం నాశనం చేశారని విమర్శించారు. జగన్ విధానాలవల్లే తెలంగాణకు, ఆంధ్రాకు పొంతన లేకుండా పోయిందని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.

Updated Date - 2023-08-29T15:55:37+05:30 IST