Chandrasekhar: నాడు కవితకు కారు లేకుంటే.. నేనే కొనిచ్చా
ABN , First Publish Date - 2023-04-23T22:41:38+05:30 IST
కేసీఆర్ సతీమణికి, మనవడికి పదవులు వస్తే పరిపూర్ణం అయినట్లేనని చంద్రశేఖర్ ఎద్దేవా చేశారు.
చేవెళ్ల: కేసీఆర్ పాలనకు చెక్ పెట్టే విధంగా కార్యకర్తలు కసితో పని చేయాలని మాజీ మంత్రి ఎ. చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. చేవెళ్లలో బీజేపీ నిర్వహించిన విజయసంకల్ప సభలో ఆయన కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులపై ధ్వజమెత్తారు. కేసీఆర్ సతీమణి శోభను వచ్చే ఏడాది రాజ్యసభకు పంపిస్తారని, తాను ఉండగానే తన మనవడిని ఎమ్మెల్యే చేయాలని కేసీఆర్ భావిస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ సతీమణికి, మనవడికి పదవులు వస్తే పరిపూర్ణం అయినట్లేనని ఎద్దేవా చేశారు. ఉద్యమం సమయంలో కల్వకుంట్ల కవితకు కారు లేకుంటే.. పోర్ట్ ఐకాస్ కారును తానే కొనిచ్చానని, పదేళ్లలో వేల కోట్లు కేసీఆర్ కుటుంబానికి ఎలా వచ్చాయని ప్రశ్నించారు.
కేంద్ర హోంమంత్రి అమిత్‌షా(Amit Shah), కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, పార్లమెంట్ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, తెలంగాణ, మధ్యప్రదేశ్ ఇంఛార్జీలు తరుణ్‌చుగ్, మురళీధర్‌రావు, సహ ఇంచార్జీ అరవింద్ మీనన్, జాతీయ కార్యవర్గ సభ్యుడు ఈటల రాజేందర్, చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, అపోలో ఆసుపత్రి అధినేత సంగీతారెడ్డి, ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి తదితరులు చేవెళ్ల సభకు హాజరయ్యారు.