TS Assembly Elections 2023 : కాంగ్రెస్ తొలి అభ్యర్థుల జాబితా రిలీజ్ ఎప్పుడంటే..?
ABN , First Publish Date - 2023-08-14T23:00:47+05:30 IST
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు (TS Assembly Elections) సమీపిస్తున్న వేళ అధికార బీఆర్ఎస్, ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్, బీజేపీలు (BRS, Congress, BJP) .. అభ్యర్థుల వేటలో పడ్డాయి. ఈసారి ఎలాగైనా సరే కేసీఆర్‌ను (CM KCR) గద్దె దించాల్సిందేనని కాంగ్రెస్ వ్యూహాత్మకంగా అడుగులేస్తోంది..
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు (TS Assembly Elections) సమీపిస్తున్న వేళ అధికార బీఆర్ఎస్, ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్, బీజేపీలు (BRS, Congress, BJP) .. అభ్యర్థుల వేటలో పడ్డాయి. ఈసారి ఎలాగైనా సరే కేసీఆర్‌ను (CM KCR) గద్దె దించాల్సిందేనని కాంగ్రెస్ వ్యూహాత్మకంగా అడుగులేస్తోంది. ఈ క్రమంలో సోమవారం నాడు గాంధీభవన్‌లో ప్రదేశ్ ఎన్నికల కమిటీ సమావేశం జరిగింది. పీఈసీ చైర్మన్, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశం జరిగింది. కమిటీ నియామకం తరువాత తొలి భేటీ జరిగింది. అభ్యర్థుల ఎంపిక విధివిధానాలపై నిశితంగా చర్చించారు.
కాగా.. టికెట్ కోసం ఇప్పటికే పీసీసీకి భారీగా దరఖాస్తులు అందాయి. సెప్టెంబర్ మొదటి వారంలో స్క్రీనింగ్ కమిటీ భేటీ జరగనుండగా.. ఆ తర్వాత సీఈసీకి తొలి జాబితా వెళ్లనుంది. అంటే..సెప్టెంబర్‌లో మధ్యలోనే కాంగ్రెస్ అభ్యర్థుల మొదటి జాబితా విడుదల కానుందన్న మాట. ఇప్పటికే మొదటి జాబితా అభ్యర్థుల ఎంపిక కసరత్తు పూర్తయ్యింది. కాగా.. పార్టీ గెలుపు అంచనా వేసుకుని సామాజిక న్యాయం చేస్తామని స్క్రీనింగ్ కమిటీ ఛైర్మెన్ మురళీ ధరన్ తెలిపారు. దరఖాస్తు చేసుకున్నవారందరికీ టికెట్లు ఇవ్వడం కుదరదని.. సర్వేలు కూడా పరిగణనలోకి తీసుకుంటామని కాంగ్రెస్ నేత మహేష్‌కుమార్ గౌడ్ మీడియాకు తెలిపారు. సర్వేలు మాత్రమే ప్రామాణికం కాదన్నారు.