Lands E-auction: కోకాపేట జోష్‌లో మరిన్ని భూముల వేలం.. వివరాలు వచ్చేశాయ్..

ABN , First Publish Date - 2023-08-04T11:28:27+05:30 IST

కోకాపేట భూముల వేలం జోష్‌లోనే మరికొన్ని భూములు వేలం వేసేందుకు తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) సిద్ధమైంది. ఈ మేరకు తదుపరి వేలానికి సంబంధించిన వివరాలను ప్రకటించింది. ఈ నెల 7న మోకిల ప్లాట్లకు హెచ్ఎండీఏ (HMDA) ఈ-వేలం (E-Auction) వేయనుంది. ఈ భూముల వేలానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ గడువు నేటితో (శుక్రవారం) ముగిసిపోనుందని తెలిపింది.

Lands E-auction: కోకాపేట జోష్‌లో మరిన్ని భూముల వేలం.. వివరాలు వచ్చేశాయ్..

హైదరాబాద్ : కోకాపేట భూముల వేలం జోష్‌లోనే మరికొన్ని భూములు వేలం వేసేందుకు తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) సిద్ధమైంది. ఈ మేరకు తదుపరి వేలానికి సంబంధించిన వివరాలను ప్రకటించింది. ఈ నెల 7న మోకిల ప్లాట్లకు హెచ్ఎండీఏ (HMDA) ఈ-వేలం (E-Auction) వేయనుంది. ఈ భూముల వేలానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ గడువు నేటితో (శుక్రవారం) ముగిసిపోనుందని తెలిపింది. ఈ వేలంలో మొత్తం 165 ఎకరాల 37 గుంటలలో 1321 ప్లాట్లను విక్రయించనుంది. మొదటి దఫాలో 50 ప్లాట్‌లకు ఈ-వేలం చేపట్టనున్నారు.

10న బుద్వేల్‌లో 100 ఎకరాలకు వేలం..

మరోవైపు.. ఈ నెల 10న హైదరాబాద్ పరిధిలోని బుద్వేల్‌లో 100 ఎకరాల వేలానికి తెలంగాణ సర్కారు సిద్ధమైంది. 14 ప్లాట్స్ ఈ-వేలానికి సన్నద్ధమైంది. ప్రభుత్వం నిర్దేశించిన కనీస ధర ఎకరానికి 20 కోట్లుగా ఉంది. ల్యాండ్ పార్శిల్ ప్యాకేజీలో మూడున్నర ఎకరాల నుంచి 14 ఎకరాల వరకు విక్రయించేందుకు సర్కారు నిర్ణయించింది. కోకాపేట నియోపోలీస్ లే ఔట్ నుంచి 15 నిమిషాల ప్రయాణం పడుతుందని ప్రభుత్వం తెలిపింది. కాగా.. గురువారం జరిగిన వేలంలో నియోపోలిస్‌ భూమి ఎకరా వంద కోట్లకు అమ్మిన విషయం తెలిసిందే. కాగా... కోకా పేట భూములు కోట్లు పలకడంతో ఇప్పుడు అందరి దృష్టి మోకిలా, బుద్వేల్ భూములపై పడింది.

Updated Date - 2023-08-04T11:28:41+05:30 IST