Home » Kokapet Lands
ఇప్పటికే గ్రేటర్‌గా మారిన హైదరాబాద్‌ను మహా నగరంగా విస్తరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. దూరంగా కొత్త నగర నిర్మాణంపై దృష్టిసారించిన సర్కారు.. విస్తరణను వేగవంతం చేసింది.
కోకాపేటలో గత ప్రభుత్వం 11 ఎకరాలు కేటాయించిన వ్యవహారంపై వివరణ ఇవ్వాలంటూ బీఆర్‌ఎస్ పార్టీకి హైకోర్టు నోటీసులు జారీచేసింది.
కేసీఆర్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రభుత్వం బీఆర్‌ఎస్ పార్టీకి కోకాపేటలో చేసిన 11 ఎకరాల భూకేటాయింపు చట్ట విరుద్ధమంటూ హైకోర్టులో ఇటీవల పిటిషన్ దాఖలైంది.
కోకాపేటలో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. ఆటో కోసం వేచి చూస్తున్న వ్యక్తిపై దాడికి పాల్పడ్డారు. ఆటోలో ఎక్కించుకొని మరీ దోపిడీ దొంగలు వ్యక్తిపై దాడికి పాల్పడ్డారు. బాధితుడి జోబులో ఉన్న నాలుగున్నర వేల రూపాయల నగదును తీసుకొని ఆటోలో నుంచి తోసేసి వెళ్లిపోయారు.
గత ప్రభుత్వ హయాంలో బీఆర్ఎస్ పార్టీకి కోకాపేటలో 11 ఎకరాల భూమిని కేటాయించడంపై హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలైన విషయం తెలిసిందే. ఖరీదైన భూమిని పార్టీ కార్యాలయం కోసం బీఆర్ఎస్‌కు కేటాయించారని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ (ఎఫ్‌జీజీ) చిక్కుడు ప్రభాకర్ ఈ పిటిషన్ వేశారు.
కోకాపేట భూముల(Kokapet lands) వ్యవహారానికి కొల్లాపూర్ ఎమ్మెల్యే హర్షవర్ధన్‌రెడ్డి(MLA Harshavardhan Reddy)కి ఎలాంటి సంబంధం లేదు.. కానీ కోర్టులో ఫిర్యాదు చేశారని ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి(Challa Venkatrami Reddy) వ్యాఖ్యానించారు.
హైదరాబాద్ రియల్ ఎస్టేట్(Hyderabad Real Estate) ఇటీవలే ఎకరా రూ.వంద కోట్ల మార్క్ దాటింది. కోకాపేట నియోపోలిస్(Kokapet Neopolis) వేలంలో దాదాపు అన్ని ప్లాట్లు ఎకరా రూ.75-80 కోట్లకు అమ్ముడు పోయాయి.
హెచ్ఎండీఏ భూముల వేలం జోరు కొనసాగుతోంది. కోకాపేట భూముల వేలం కావల్సినంత జోష్ ఇవ్వడంతో తెలంగాణ ప్రభుత్వం వరుసబెట్టి ప్రాంతాల వారీగా భూములను వేలం వేస్తోంది. నేడు భూముల వేలానికి సంబంధించి హెచ్ఎండీఏ మరో నోటిఫికేషన్ విడుదల చేసింది. రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల్లో ఓపెన్ ప్లాట్ల విక్రయానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. రంగారెడ్డిలో 8, మేడ్చల్ లో 8, సంగారెడ్డిలో 10 ల్యాండ్ పార్సెల్స్ రెడీగా ఉన్నాయి.
కోకాపేట భూముల వేలం జోష్‌లోనే మరికొన్ని భూములు వేలం వేసేందుకు తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) సిద్ధమైంది. ఈ మేరకు తదుపరి వేలానికి సంబంధించిన వివరాలను ప్రకటించింది. ఈ నెల 7న మోకిల ప్లాట్లకు హెచ్ఎండీఏ (HMDA) ఈ-వేలం (E-Auction) వేయనుంది. ఈ భూముల వేలానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ గడువు నేటితో (శుక్రవారం) ముగిసిపోనుందని తెలిపింది.
కోకాపేట.. భూముల(Kokapet Lands) వేలంతో కోట్లపేటగా మారింది. గురువారం ఆన్లైన్లో జరిగిన కోకాపేట భూముల వేలంలో ఎకరం రూ.100.75 కోట్ల రికార్డు ధర(Record price) పలికింది.