BRS: బీఆర్‌ఎస్‌కు జాతీయ అధ్యక్షుడు ఎవరు: బండి సంజయ్
ABN , First Publish Date - 2023-01-03T17:17:07+05:30 IST
తెలంగాణ (Telangana)లో ఎక్కడా 24 గంటల కరెంట్ రావడం లేదని రాష్ట్ర బీజేపీ (BJP) అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay) అన్నారు.
హైదరాబాద్: తెలంగాణ (Telangana)లో ఎక్కడా 24 గంటల కరెంట్ రావడం లేదని రాష్ట్ర బీజేపీ (BJP) అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay) అన్నారు. బీఆర్‌ఎస్ (BRS)కు జాతీయ అధ్యక్షుడు ఎవరు? అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో 18 లక్షలు ఉన్న బోర్లు 20 లక్షలకు పైగా పెరిగాయన్నారు. నిరుద్యోగంలో దేశంలోనే తెలంగాణ 5వ స్థానం, దక్షిణాదిలో మొదటి స్థానంలో ఉందన్నారు. రైతుల ఆత్మహత్యల్లో రాష్ట్రం 4వ స్థానంలో ఉందని పేర్కొన్నారు. మద్యం ద్వారా 44 వేల కోట్ల ఆదాయం వస్తుందన్నారు. పథకాలు పోనూ 17 వేల కోట్లు మిగులుతున్నాయని ఆరోపించారు. ఆ డబ్బంతా ఎక్కడికి పోతుందో అర్థంకావడం లేదన్నారు. ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్, నిరుద్యోగ భృతి లేదని బండి సంజయ్ చెప్పారు. ఎన్నికల కోసమే ఉద్యోగాల నోటిషికేషన్ వెలువడిందన్నారు. నిరుద్యోగుల నోరు మూయించేందుకు కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారని అన్నారు. తెలంగాణను అన్ని రంగాల్లో నాశనం చేసిన కేసీఆర్ దేశాన్ని ఏ విధంగా ఉద్దరిస్తారు? అని ఆయన ప్రశ్నించారు.