MLC Mahender Reddy: ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2023-05-24T21:23:02+05:30 IST

బీఆర్ఎస్ (BRS) ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి (MLC Mahender Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు.

MLC Mahender Reddy: ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

వికారాబాద్: బీఆర్ఎస్ (BRS) ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి (MLC Mahender Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ గుర్తు పైన గెలిచి బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చిన వారందరని ప్రజలు తిరస్కరిస్తారని, కర్ణాటక ఎన్నికల్లో అదే జరిగిందని కీలక వ్యాఖ్యలు చేశారు. తాను కారు గుర్తు పైనే గెలిచానని, వేరే పార్టీలో గెలిచి రాలేదన్నారు. సర్వేలన్నీ తనకే అనుకూలంగా ఉన్నాయన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలలో పాల్గొని విజయవంతం చేస్తామని పేర్కొన్నారు. ప్రజా క్షేత్రంలోకి పల్లెకు పల్లె పట్నం కార్యక్రమాన్ని జూన్ 21 నుంచి నిర్వహిస్తామని తెలిపారు. మీడియా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

Updated Date - 2023-05-24T21:26:46+05:30 IST