ACB : 8 గంటలపాటు సోదాల తర్వాత తెలంగాణ వర్సిటీ వీసీ అరెస్ట్..

ABN , First Publish Date - 2023-06-17T18:34:22+05:30 IST

తెలంగాణ యూనివర్సిటీ వీసీ రవీందర్‌గుప్తాను (Telangana University VC Ravindra Gupta) అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

ACB : 8 గంటలపాటు సోదాల తర్వాత తెలంగాణ వర్సిటీ వీసీ అరెస్ట్..

హైదరాబాద్: తెలంగాణ యూనివర్సిటీ వీసీ రవీందర్‌గుప్తాను (Telangana University VC Ravindra Gupta) అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. తన నివాసంలో 8 గంటలపాటు సోదాల అనంతరం వీసీని అదుపులోకి తీసుకున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. వీసీని జడ్జి ముందు హాజరుపర్చనున్నారు. రూ. 50 వేలు లంచం తీసుకుంటూ ఆయన ఏసీబీకి దొరికిపోయారు. వర్సిటీలో వీసీ అక్రమాలకు పాల్పడినట్లు విద్యాశాఖకు ఫిర్యాదు చేశారు. ఏసీబీ తనిఖీల్లో రవీందర్‌గుప్తా అక్రమాస్తులు బయటపడుతున్నాయి.

వీసీ రవీందర్‌గుప్తా నివాసంలో ఏసీబీ సోదాలు ముగిశాయి. ఈ సోదాల్లో కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. వీసీ బ్యాంక్ అకౌంట్లు ఇతర పత్రాలను తనిఖీ చేశారు. కాసేపట్లో రవీందర్ గుప్తా అరెస్ట్ చేస్తామని డీఎస్పీ సుదర్శన్ తెలిపారు. రవీందర్ గుప్తా ఏసీబీ ట్రాప్‌లో చిక్కుకున్న విషయం తెలిసిందే. హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు (ACB Officials) రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

గత వారమే ఆయనపైన ఆరోపణలు రావడంతో ఏసీబీ టీమ్ నేరుగా యూనివర్శిటీకి వెళ్ళి ఆయన ఛాంబర్‌లో సోదాలు నిర్వహించింది. ఆ తనిఖీల్లో ఏ వివరాలు దొరికాయన్నది గోప్యంగానే ఉంచారు. ఈ క్రమంలో శనివారం ఉదయం హైదరాబాద్ నివాసంలో వీసీ లంచం తీసుకుంటూ ఉండగా రెడ్ హ్యాండెడ్‌గా దొరికారు. నియామకాల విషయంలో అవతవకలకు పాల్పడ్డారని, నిధుల దుర్వినియోగం కూడా జరిగిందనేది ఆయనపై అనేక ఆరోపణలు వచ్చాయి. అయితే రవీందర్ గుప్తా ఏసీబీ ట్రాప్‌కు చిక్కడంతో ఆయన హయాంలో వర్శిటీలో జరిగిన గోల్‌మాల్ వ్యవహారాలు వెలుగులోకి వచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

Updated Date - 2023-06-17T18:55:24+05:30 IST