Tenth paper leak case: టెన్త్‌ పేపర్‌ లీక్‌ కేసులో A1గా బండి సంజయ్‌.. పోలీస్ రిమాండ్ రిపోర్ట్‌లో సంచలన విషయాలు

ABN , First Publish Date - 2023-04-05T17:19:53+05:30 IST

టెన్త్‌ పేపర్‌ లీక్‌ కేసులో A1గా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్‌ను పోలీస్ రిమాండ్ రిపోర్ట్‌లో చేర్చారు.

Tenth paper leak case: టెన్త్‌ పేపర్‌ లీక్‌ కేసులో A1గా బండి సంజయ్‌.. పోలీస్ రిమాండ్ రిపోర్ట్‌లో సంచలన విషయాలు

హైదరాబాద్: టెన్త్‌ పేపర్‌ లీక్‌ కేసులో A1గా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్‌ను పోలీస్ రిమాండ్ రిపోర్ట్‌లో చేర్చారు. A2గా బూర ప్రశాంత్‌, A3గా మహేష్‌, A4గా బాలుడు, A5గా మోతం శివగణేశ్‌, A6గా పోగు సుభాష్‌, A7గా పోగు శశాంక్, A8గా దూలం శ్రీకాంత్‌, A9గా పెరుమాండ్ల శార్మిక్, A10గా పోతబోయిన వసంత్‌ను పోలీస్ రిమాండ్ రిపోర్ట్‌లో చేర్చారు.

పరీక్షల వ్యవస్థను దెబ్బతీసేలా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay) కుట్ర చేస్తున్నారని.. అందుకే ముందస్తు చర్యగా ఆయనను అరెస్టు చేశామని పోలీసులు ప్రకటించారు. వికారాబాద్ (Vikarabad), కమలపూర్‌ (Kamalapur)లో పేపర్ లీకేజ్‌ (Paper Leakage)లపై బండి సంజయ్ ప్రెస్ నోట్ (Press Note) ఇచ్చారని, పేపర్ లీకేజ్‌లకు ప్రభుత్వమే బాధ్యతంటూ.. విద్యార్థులను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసి శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ప్రవర్తించారని పోలీసులు ఎఫ్ఐఆర్‌ (FIR)లో పేర్కొన్నారు.

పరీక్ష కేంద్రాల వద్ద ధర్నాలు చేయాలని, పరీక్షల నిర్వహణకు విఘాతం కలిగేలా ఆందోళనలు చేయాలని బీజేపీ శ్రేణులకు ఉద్దేశపూర్వకంగా పిలుపునిచ్చారని పోలీసులు పేర్కొన్నారు. బండి సంజయ్ చర్యల వల్ల పరీక్షలు నిర్వహించడం ఇబ్బందికరంగా మారే అవకాశం ఉందని అందుకే ముందస్తుగా అరెస్టు చేశామన్నారు. అనేక మంది విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలోపెట్టుకుని, పరీక్షలకు విఘాతం కలగకుండా ఉండేందుకే బండి సంజయ్‌ని ప్రివెన్షన్ కింద అరెస్ట్ చేశామని పోలీసులు స్పష్టం చేశారు.

Updated Date - 2023-04-05T17:25:39+05:30 IST