Krishna Tribunal: గడువు మరోసారి పొడిగింపు
ABN , First Publish Date - 2023-07-08T21:22:09+05:30 IST
కృష్ణా నదీ జల వివాదాల పరిష్కార ట్రిబ్యునల్(Krishna Tribunal ) గడువును కేంద్రం మరోసారి పెంచింది. రెండు తెలుగు రాష్ట్రాల(Two Telugu states) మధ్య జల వివాద పరిష్కారంపై తీర్పు ఇవ్వాల్సి ఉన్నందున కేంద్రం ఈ గడువు పొడిగించినట్లు సమాచారం.
ఢిల్లీ: కృష్ణా నదీ జల వివాదాల పరిష్కార ట్రిబ్యునల్(Krishna Tribunal ) గడువును కేంద్రం మరోసారి పెంచింది. రెండు తెలుగు రాష్ట్రాల(Two Telugu states) మధ్య జల వివాద పరిష్కారంపై తీర్పు ఇవ్వాల్సి ఉన్నందున కేంద్రం ఈ గడువు పొడిగించినట్లు సమాచారం. ఈ మేరకు కేంద్ర జలశక్తి శాఖ ఉత్తర్వులు విడుదల చేసింది. 2024 మార్చి 31 వరకు కేంద్ర ప్రభుత్వం కృష్ణా ట్రైబ్యునల్ గడువు పొడిగించింది. ఈ ఏడాది ఆగస్టు 1వ తేదీ నాటికి ట్రిబ్యునల్ తీర్పు వెలువరించాల్సి ఉంది. ఇరు రాష్ట్రాల వాదనలు ఇంకా కొనసాగుతుండటం, తీర్పు ఇవ్వడానికి మరికొంత సమయం తీసుకుంటుండటంతో ట్రైబ్యునల్. గడువు పొడిగించింది.