MLA Durgam Chinnaiah : చిన్నయ్యపై సంచలన ఆరోపణలు చేసిన ఆరిజిన్ డెయిరీ వ్యవహారంలో కొత్త ట్విస్ట్
ABN , First Publish Date - 2023-03-30T13:33:35+05:30 IST
మ్మెల్యే దుర్గం చిన్నయ్య పై సంచలన ఆరోపణలు చేసిన ఆరిజిన్ డెయిరీ వ్యవహారంలో కొత్త కోణాలు వెలుగు చూశాయి. డైరీ నిర్వాహకులు జిల్లాలో భారీ మోసాలకు పాల్పడినట్టు తెలుస్తోంది.
మంచిర్యాల : ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పై సంచలన ఆరోపణలు చేసిన ఆరిజిన్ డెయిరీ వ్యవహారంలో కొత్త కోణాలు వెలుగు చూశాయి. డైరీ నిర్వాహకులు జిల్లాలో భారీ మోసాలకు పాల్పడినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి కొంతమంది బాధితులు మీడియా ముందుకు వచ్చారు. గేదెల యూనిట్లు, ఇన్సూరెన్స్, ఉద్యోగాల కల్పన, డైరీ యూనిట్ ఏర్పాటు పేరిట డబ్బుల వసూళ్లకు పాల్పడినట్టు చెబుతున్నారు. ఆదినారాయణ అనే వ్యక్తి మరో యువతి కలిసి మోసం చేసినట్టు బాధితులు వెల్లడించారు. డబ్బులు అడిగితే తమనే బెదిరిస్తున్నారని బాధితుల ఆవేదన వ్యక్తం చేశారు. డైరీ చైర్మన్ ఆది నారాయణపై రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పలు కేసులున్నాయని పోలీసులు సైతం చెబుతున్నారు. దుర్గం చిన్నయ్యపై బోడపాటి శైలజ అనే మహిళ తీవ్ర ఆరోపణలు చేసిన కొద్ది రోజులకే డైరీ నిర్వాహకులపై ఇలాంటి ఆరోపణలు రావడం చర్చనీయాంశంగా మారింది.
అంతకు ముందు ఏం జరిగిందంటే..
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై ఓ మహిళ సంచలన ఆరోపణలు చేశారు. ఆయనపై ‘ఆరిజన్ డెయిరీ’ సంస్థ సీఈవో బోడపాటి శైలజ అలియాస్ షెజల తీవ్ర ఆరోపణలు చేశారు. బెల్లంపల్లిలో డెయిరీ ఏర్పాటుకు స్థలం ఇచ్చి సహకరిస్తానంటూ ఎమ్మెల్యే డబ్బులు తీసుకున్నారని ఆరోపించారు. డెయిరీ సంస్థ విస్తరణ కోసం దుర్గం చిన్నయ్య చెప్పినట్లుగా విన్నానని, హైదరాబాద్‌కు వెళ్లినప్పుడల్లా ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో ఆయనకు తాను ఎన్నో సపర్యలు చేశానని.. అమ్మాయిలను పంపాలని ఒత్తిడి చేస్తే పంపాననీ చెప్పారు!! హామీ ఇచ్చినట్లుగా ప్లాంటు ఏర్పాటు చేసిన భూమిని రిజిస్ట్రేషన్ చేయించకపోగా తమపైనే ఆయన తప్పుడు కేసులు పెట్టించి వేధింపులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు బోడపాటి శైలజ వాయి్సగా చెబుతున్న ఆడియో రికార్డు ఒకటి వైరల్ అవుతోంది. దుర్గం చిన్నయ్య నుంచి తనకు ప్రాణహాని ఉందని ఆందోళన వ్యక్తం చేసిన ఆమె, ఆయన్నుంచి తనను కాపాడాలని విజ్ఞప్తి చేశారు.
బ్లాక్ మెయిల్ చేస్తున్నారు: దుర్గం చిన్నయ్య
‘‘డెయిరీ పేరుతో రైతులను మోసగించేందుకు ఆది నారాయణ, షెజల ప్రయత్నించారు. దీన్ని నేను అడ్డుకోవడంతో సమాజంలో నా పేరును డ్యామేజ్ చేసేందుకు బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. కట్టుకథలల్లుతూ బ్లాక్ మెయిలింగ్‌కు పాల్పడుతున్నారు. వాళ్లు చీటర్స్ కావడం, రైతులను మోసం చేసేందుకు ప్రయత్నం చేయడంతో పోలీసులకు పట్టించడం జరిగింది’’ అని బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పేర్కొన్నారు.