Khairatabad Ganesh: ఖైరతాబాద్ గణేష్‌ను చూసేందుకు తరలివచ్చిన వేలాది మంది భక్తులు

ABN , First Publish Date - 2023-09-24T17:13:57+05:30 IST

ఖైరతాబాద్ గణేష్‌ను (Khairatabad Ganesh) చూసేందుకు వేలాది మంది భక్తులు రావడంతో ఆ ప్రాంతం కిక్కిరిసింది.

Khairatabad Ganesh: ఖైరతాబాద్ గణేష్‌ను చూసేందుకు తరలివచ్చిన వేలాది మంది భక్తులు

హైదరాబాద్: ఖైరతాబాద్ గణేష్‌ను (Khairatabad Ganesh) చూసేందుకు వేలాది మంది భక్తులు రావడంతో ఆ ప్రాంతం కిక్కిరిసింది. మహాగణపతి దర్శనానికి భక్తులు బారులు తీరారు. ఈ ఒక్కరోజే లక్ష మందికిపైగా దర్శించుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆదివారం కావడంతో వేలాదిగా భక్తులు తరలిస్తున్నారు. ఖైరతాబాద్, లక్డీకాపూల్, ట్యాంక్ బండ్ (Tank bund) పరిసర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జాం అవుతోంది. చిన్నపిల్లలు, వృద్ధులతో వచ్చి ఇబ్బందులకు గురవద్దంటూ ఖైరతాబాద్ ఉత్సవ నిర్వాహకులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Updated Date - 2023-09-24T17:20:34+05:30 IST