Jaggareddy: ఓటమి గుణపాఠం నేర్పింది.. కాంగ్రెస్ కోసం రేవంత్‌తో కలిసి పని చేస్తా
ABN , Publish Date - Dec 17 , 2023 | 12:50 PM
అసెంబ్లీ ఎన్నికల్లో సంగారెడ్డి(Sangareddy) నుంచి పోటీ చేసి ఓటమి చవిచూసిన మాజీ ఎమ్మెల్యే, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి(Jaggareddy) కీలక వ్యాఖ్యలు చేశారు.
సంగారెడ్డి: అసెంబ్లీ ఎన్నికల్లో సంగారెడ్డి(Sangareddy) నుంచి పోటీ చేసి ఓటమి చవిచూసిన మాజీ ఎమ్మెల్యే, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి(Jaggareddy) కీలక వ్యాఖ్యలు చేశారు. ఇవాళ(ఆదివారం) ఆయన మాట్లాడుతూ.. తాను సంగారెడ్డి నుంచి 5 సార్లు పోటీ చేశానని.. 3 సార్లు ప్రజలు తనను ఆశీర్వదించారని గుర్తుచేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తన ఓటమిపై స్పందిస్తూ.. ఓటమి తనకు ఎన్నో గుణపాఠాలు నేర్పిందన్నారు.
బలవంతుడు ఏదో ఒకరోజు బలహీనుడు కాకతప్పదని చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని(Congress) అధికారంలోకి తీసుకువచ్చినందుకు ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. రానున్న ఐదేళ్లు ఏఐసీసీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర అభివృద్ధి కోసం పని చేస్తానని స్పష్టం చేశారు.
"ఒక నాయకుడి ఓటమి పరిపాలనలో ఉన్న లోపాలను సమీక్షించుకొని భవిష్యత్తులో విజయాలు సాధించడానికి ముందడుగు వేసేందుకు దోహదపడుతుంది. ఓటమి నాకు ఎన్నో అనుభవాలు నేర్పింది. బలహీనుడు ఎప్పటికీ బలహీనుడిగానే ఉండిపోడు. వచ్చే 5 ఏళ్లు నాకు రెస్ట్ తీసుకోమని ప్రజలు తీర్పునిచ్చారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ 6 గ్యారెంటీలు సమర్థంగా అమల్లయ్యేలా చర్యలు తీసుకుంటా. సంగారెడ్డి నియోజకవర్గ ప్రజలందరికీ పథకాలు అందేలా కృషి చేస్తా" అని జగ్గారెడ్డి అన్నారు.