Talasani: మహంకాళి అమ్మవారిని మొక్కుకుంటే మంచి జరుగుతుందని భక్తుల నమ్మకం

ABN , First Publish Date - 2023-07-09T17:25:04+05:30 IST

ఉజ్జయిని మహంకాళి (Ujjaini Mahankali) అమ్మవారిని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Talasani Srinivas Yadav) దర్శించుకున్నారు.

Talasani: మహంకాళి అమ్మవారిని మొక్కుకుంటే మంచి జరుగుతుందని భక్తుల నమ్మకం

సికింద్రాబాద్: ఉజ్జయిని మహంకాళి (Ujjaini Mahankali) అమ్మవారిని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Talasani Srinivas Yadav) దర్శించుకున్నారు.


''ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు ప్రతీక. అమ్మవారిని మొక్కుకుంటే మంచి జరుగుతుంది అని భక్తుల నమ్మకం. లక్షల సంఖ్యలో భక్తులు వస్తూ ఉండటంతో ఈసారి క్యూలైన్‌లు పెంచాం. అమ్మవారి గర్భగుడిలో భక్తులకు అసౌకర్యం కలగకుండా తొలి సారి ఏసీ కూడా ఏర్పాటు చేశాం. 25 నుంచి 175కు సీసీ కెమెరాల సంఖ్యను పెంచాం. ఆలయం పరిసర ప్రాంతాల్లో సీసీ రోడ్లు వేయించాం. డ్రైనేజీలను క్లీన్ చేయించాం. భక్తుల కోసం మంచినీటి సదుపాయాన్ని కూడా ఏర్పాటు చేశాం. అమ్మవారి దర్శనం కోసం వివిధ రకాల పార్టీలకు సంబంధించిన నాయకులు వస్తున్నారు. పార్టీలకు కుల మతాలకు అతీతంగా అమ్మవారి దర్శనం చేసుకునేలా ఏర్పాటు చేశాం. పోలీసులు ఎక్కడికక్కడ మానిటరింగ్ చేస్తున్నారు ఏర్పాట్లు అద్భుతంగా ఉన్నాయి." అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.

Updated Date - 2023-07-09T17:27:49+05:30 IST