CM KCR: మహబూబాబాద్ జిల్లాకు సీఎం కేసీఆర్ వరాలు..

ABN , First Publish Date - 2023-01-12T14:49:24+05:30 IST

మహబూబాబాద్: జిల్లా పర్యటనకు వచ్చిన సీఎం కేసీఆర్ (CM KCR) కొత్తగా నిర్మించిన కలెక్టరేట్‌ (Collectorate), బీఆర్ఎస్ (BRS) భవనాల్ని (Buildings) ప్రారంభించారు.

CM KCR: మహబూబాబాద్ జిల్లాకు సీఎం కేసీఆర్ వరాలు..

మహబూబాబాద్: జిల్లా పర్యటనకు వచ్చిన సీఎం కేసీఆర్ (CM KCR) కొత్తగా నిర్మించిన కలెక్టరేట్‌ (Collectorate), బీఆర్ఎస్ (BRS) భవనాల్ని (Buildings) ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ మహబూబాబాద్ జిల్లాకు వరాల జల్లు కురిపించారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించాక చాలా పనులు జరిగాయన్నారు. ప్రజా సమస్యలు తీర్చే వేదికగా కలెక్టరేట్లు ఉన్నాయని, తెలంగాణ మంచి అభివృద్ధి దశలో ఉందన్నారు. తెలంగాణ వచ్చాక మెడికల్ కాలేజీలు 4 నుంచి 33కు పెరిగాయన్నారు. త్వరలోనే మహబూబాబాద్‌కు మెడికల్, ఇంజనీరింగ్ కాలేజీలు ఏర్పాటు చేస్తామన్నారు. వచ్చే ఏడాది నుంచి తరగతులు ప్రారంభిస్తామన్నారు. మహబూబాబాద్‌ పట్టణం అభివృద్ధికి రూ.50 కోట్లు.., జిల్లాలోని మిగతా మున్సిపాలిటీలకు రూ.25 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. సీఎం ప్రత్యేక నిధినుంచి ప్రతీ గ్రామానికి రూ. 10 లక్షల నిధులిస్తున్నానని సీఎం కేసీఆర్ తెలిపారు.

నదులలో అవసరానికి మించిన నీరు ఉంటుందని, నదీ జలాల కోసం ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తారని, కానీ తీర్పు రావడానికి దశాబ్దాలు పడుతుందని సీఎం కేసీఆర్ అన్నారు. తీర్పుకు ఇంత జాప్యం జరిగితే నీళ్లు ఎప్పుడు వాడుకోవాలన్నారు. శాంతియుతంగా ఉంటేనే అభివృద్ధి చెందుతుందని, మతపిచ్చితో రగిలిపోతే అంతా నాశనమే అవుతుందన్నారు. మత విద్వేషాలు రెచ్చగొడితే దేశం మరో ఆఫ్ఘానిస్తాన్ అవుతుందని, దీనిపై మతపెద్దలు, మేధావులు చర్చ జరపాలని సీఎం కేసీఆర్‌ సూచించారు. కేంద్రం అసమర్థత వల్ల తెలంగాణ చాలా నష్టపోయిందన్నారు. కేంద్రంలో పక్షపాతం లేని ప్రభుత్వం ఉంటేనే దేశం అంతా అభివృద్ధి చెందుతుందన్నారు. దేశంలో అభివృద్ధి వీచిక తెలంగాణ నుంచే వీయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యానించారు.

Updated Date - 2023-01-12T14:49:28+05:30 IST