TS News: మహబూబాబాద్ వీఆర్‌ఏ నియామక పత్రాల్లో గందరగోళం
ABN , First Publish Date - 2023-08-10T15:21:50+05:30 IST
జిల్లాలో వీఆర్ఏ నియామక పత్రాల్లో గందరగోళం నెలకొంది. తన పోస్టును వేరే వారికి కేటాయించడంతో ఓ వ్యక్తి ప్రాణాలు తీసుకునేందుకు కూడా వెనకాడలేదు.
మహబూబాబాద్: జిల్లాలో వీఆర్ఏ నియామక పత్రాల్లో గందరగోళం నెలకొంది. తన పోస్టును వేరే వారికి కేటాయించడంతో ఓ వ్యక్తి ప్రాణాలు తీసుకునేందుకు కూడా వెనకాడలేదు. నెల్లికుదురు మండలం మునిగలవీడు గ్రామానికి చెందిన షేక్ సలీం తనకు వచ్చిన పోస్టును వేరేవారికి ఇచ్చారని తీవ్ర మనస్థాపంతో మంత్రి సత్యవతి రాథోడ్ సమక్షంలో ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు అతడిని అడ్డుకోవడంతో ప్రమాదం తప్పింది. అయితే తన తండ్రి హుస్సేన్ ఉద్యోగం అర్హత లేని వారికి కేటాయించడంతో మనస్తాపానికి గురైన షేక్ సలీం బలవన్మరణానికి పాల్పడ్డాడు. అదే గ్రామానికి చెందిన యాకుబ్ పాషాకు ఉద్యోగం కేటయించడంతో ఆందోళన వ్యక్తం చేశాడు. నెల్లికుదురు మండల డిప్యూటీ తహశీల్దార్ తరంగిణి డబ్బులు తీసుకొని యాకుబ్ పాషాకు పోస్టింగ్ కేటాయించారని ఆరోపించాడు. తన వారసత్వ ఉద్యోగం తనకు ఇవ్వాలని బాధితుడ షేక్ సలీం డిమాండ్ చేస్తున్నాడు.