Mahbubabad Dist.: దళిత మహిళ ఆత్మహత్యాయత్నం..

ABN , First Publish Date - 2023-06-01T16:10:33+05:30 IST

మహబూబాబాద్ జిల్లా: చిన్నగూడూరులో దళిత మహిళ ఆత్మహత్యాయత్నం (Suicide Attempt) చేసింది. పెట్రోల్ బాటిల్‌ (Petrol Bottle)తో తన భర్త సమాధి వద్ద ఆందోళన చేసింది.

Mahbubabad Dist.: దళిత మహిళ ఆత్మహత్యాయత్నం..

మహబూబాబాద్ జిల్లా: చిన్నగూడూరులో దళిత మహిళ ఆత్మహత్యాయత్నం (Suicide Attempt) చేసింది. పెట్రోల్ బాటిల్‌ (Petrol Bottle)తో తన భర్త సమాధి వద్ద ఆందోళన చేసింది. తన భూమిలో ప్రభుత్వం డబుల్ బెడ్ రూం (Double Bedroom) ఇళ్లను నిర్మిస్తోందని ఆమె ఆందోళన వ్యక్తం చేసింది. బీఆర్ఎస్ నేతలు (BRS Leaders) తన భూమిని స్వాధీనం చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ఎమ్మార్వో, పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదని వాపోయింది.

చిన్నగూడూరుకు చెందిన మద్దెల యాదమ్మకు గత ప్రభుత్వం మూడెకరాల భూమి ఇచ్చింది. దీనికి సంబంధించి పట్టా కాగితాలు కూడా ఉన్నాయి. అయితే యాదమ్మ భర్త కొన్నాళ్ల క్రితం చనిపోయారు. ఆయన ఉన్నప్పుడు ఒక ఎకరం పోలీస్ స్టేషన్ నిర్మాణానికి ఇచ్చారు. మిగిలిన రెండు ఎకరాల భూమిని సాగు చేసుకుంటున్నారు. ఇది కూడా ప్రభుత్వ భూమని స్థానిక బీఆర్ఎస్ నేతలు పేర్కొంటూ డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం ప్రారంభించారు. దీంతో యాదమ్మ దిక్కుతోచని స్థితిలో పెట్రోల్ బాటిల్ పట్టుకుని భర్త సమాధి వద్ద ఆందోళనకు దిగింది.

Updated Date - 2023-06-01T16:12:03+05:30 IST