KU Students: గాంధీ విగ్రహం ఎదుట కేయూ విద్యార్థుల నిరసన.. ఉద్రిక్తం

ABN , First Publish Date - 2023-10-02T09:20:21+05:30 IST

గాంధీ జయంతి సందర్భంగా పబ్లిక్ గార్డెన్‌లోని ఆయన విగ్రహం ఎదుట కేయూ విద్యార్థులు నిరస ఉద్రిక్తతకు దారి తీసింది.

KU Students: గాంధీ విగ్రహం ఎదుట కేయూ విద్యార్థుల నిరసన.. ఉద్రిక్తం

హనుమకొండ: గాంధీ జయంతి సందర్భంగా పబ్లిక్ గార్డెన్‌లోని ఆయన విగ్రహం ఎదుట కేయూ విద్యార్థులు నిరస ఉద్రిక్తతకు దారి తీసింది. పీహెచ్‌డీ అడ్మిషన్ల అవకతవకలపై గత కొద్దిరోజులు కేయూ విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. ఈ రోజు ఉదయం గాంధీ విగ్రహం ఎదుట చేతులకు సంకెళ్లు, నల్ల రిబ్బన్‌లతో నిరసన దీక్ష చేపట్టారు. 11 గంటలలోగా వీసీ, రిజిస్ట్రార్ స్పందించకపోతే 12 గంటలకు ఆత్మార్పణకు పాల్పడుతామని విద్యార్థులు హెచ్చరించారు. అయితే ఆత్మార్పణ చేసుకునేందుకు వచ్చిన విద్యార్థులను తరలించేందుకు పోలీసులుయత్నించారు. ఆ ప్రాంతంలోకి పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. గాంధీ విగ్రహం దగ్గర ఇనుప సంకెళ్లతో విద్యార్థులు తమను తాము బంధించుకున్నారు. దీంతో కట్టర్లతో ఇనుప సంకెళ్లు తెంచి విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారు.

Updated Date - 2023-10-02T09:20:21+05:30 IST