TS News: జానకీపురం సర్పంచ్ నవ్య ఫిర్యాదుపై నోటీసులు

ABN , First Publish Date - 2023-06-23T18:02:45+05:30 IST

బీఆర్ఎస్ ఎమ్మెల్యే రాజయ్యపై జానకిపురం సర్పంచ్ నవ్య చేసిన ఫిర్యాదుపై పోలీసులు స్పందించారు. ఎమ్మెల్యే, ఆయన అనుచరులు వేధించినట్టు ఆధారాలు ఉంటే ఇవ్వాలని నవ్యకు కాజీపేట ఏసీపీ శ్రీనివాస్ నోటీసులు ఇచ్చారు. మూడు రోజుల్లో ఆధారాలు సమర్పించాలని నోటీసులో పేర్కొన్నారు.

TS News: జానకీపురం సర్పంచ్ నవ్య ఫిర్యాదుపై నోటీసులు

వరంగల్: బీఆర్ఎస్ ఎమ్మెల్యే రాజయ్యపై జానకీపురం సర్పంచ్ నవ్య చేసిన ఫిర్యాదుపై పోలీసులు స్పందించారు. ఎమ్మెల్యే, ఆయన అనుచరులు వేధించినట్టు ఆధారాలు ఉంటే ఇవ్వాలని నవ్యకు కాజీపేట ఏసీపీ శ్రీనివాస్ నోటీసులు ఇచ్చారు. మూడు రోజుల్లో ఆధారాలు సమర్పించాలని నోటీసులో పేర్కొన్నారు. ఆధారాలు పరిశీలించాకే కేసు నమోదుపై నిర్ణయం తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు. తన దగ్గర అన్నీ ఆధారాలు ఉన్నాయని, పోలీసులకు అందజేస్తామనని నవ్య స్పష్టం చేసింది.

రికార్డింగ్ వాయిస్‌లు ఇవ్వాలంటూ ఎమ్మెల్యే రాజయ్య అనుచరులు వేధిస్తున్నారంటూ ఇటీవల నవ్య మీడియా ముందు ఆరోపించారు. తన భర్తను లొంగదీసుకుని కుటుంబం మధ్య కలహాలు రేపుతున్నారని ఆమె ఆరోపించింది. ఈ మేరకు పోలీసులకు ఆమె ఫిర్యాదు చేసింది. ఎమ్మెల్యేతో పాటు భర్తపై కూడా ఆమె ఫిర్యాదు చేసింది. ఇదే అంశంపై ఆధారాలు ఇవ్వాలంటూ పోలీసులు నవ్యకు నోటీసు ఇచ్చారు.

eajay.gif

Updated Date - 2023-06-23T18:04:49+05:30 IST