Pawan: నేడు వరంగల్‌లో పవన్ కళ్యాణ్ పర్యటన
ABN , First Publish Date - 2023-11-22T07:05:09+05:30 IST
వరంగల్: తెలంగాణలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం చేయనున్నారు. బుధ, గురువారాలు రెండు రోజుల పర్యటన షెడ్యూల్ ఖరారయింది. బుధవారం వరంగల్ నగరంలో పర్యటించనున్నారు.
వరంగల్: తెలంగాణలో జనసేన అధినేత (Janasena Chief) పవన్ కల్యాణ్ (Pawan Kalyan ) ఎన్నికల ప్రచారం (Election Campaign) చేయనున్నారు. బుధ, గురువారాలు రెండు రోజుల పర్యటన షెడ్యూల్ ఖరారయింది. బుధవారం వరంగల్ (Warangal) నగరంలో పర్యటించనున్నారు. హనుమకొండలో జరిగే బీజేపీ (BJP) విజయసంకల్ప సభలో (Vijayasankalpa Sabha) పాల్గొననున్నారు. బీజేపీతో జనసేన పొత్తులో భాగంగా బీజేపీ అభ్యర్థుల తరఫున పవన్ ప్రచారం చేయనున్నారు. జనసేనాని రాక సందర్భంగా బీజేపీ నాయకులు భారీ ఏర్పాట్లు చేశారు.
కాగా బీజేపీ పార్టీ పొత్తుతో తెలంగాణ ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తుంది. ఉమ్మడి అభ్యర్థుల తరుపున పవన్‌కల్యాణ్ ప్రచారం చేయనున్నారు. వరంగల్, కొత్తగూడెం, సూర్యాపేట, దుబ్బాకలో ప్రచార సభల్లో పవన్ కళ్యాణ్ ప్రసంగించనున్నారు.