Sarpanch Navya: మరోసారి ఎమ్మెల్యే రాజయ్యపై సర్పంచ్ నవ్య సంచలన ఆరోపణలు

ABN , First Publish Date - 2023-06-20T17:33:25+05:30 IST

స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య (MLA Rajaiah)పై సర్పంచ్ నవ్య (Sarpanch Navya) మరోసారి సంచలన ఆరోపణలు చేశారు.

Sarpanch Navya: మరోసారి ఎమ్మెల్యే రాజయ్యపై సర్పంచ్ నవ్య సంచలన ఆరోపణలు

వరంగల్: స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య (MLA Rajaiah)పై సర్పంచ్ నవ్య (Sarpanch Navya) మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. తనవద్ద ఉన్నా ఆడియో రికార్డ్‌లు ఇవ్వాలని ఆయన అనుచరులతో ఒత్తిడి చేయిస్తున్నారని సర్పంచ్ నవ్య ఆరోపించారు. అప్పట్లో చేసిన లైంగిక ఆరోపణలకు సంబంధించిన టేపులు ఇవ్వాలని ఎమ్మెల్యే ఒత్తిడి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు తన భర్తకు మధ్య చిచ్చు పెట్టి ఎమ్మెల్యే రాజయ్య పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజయ్య చేసిన లైంగిక ఆరోపణల టేపులు ఏబీఎన్ వేదికగా బయటపెడతానని నవ్య వెల్లడించారు. ఇరవై లక్షలు ఇస్తా కాంప్రమైజ్ కావాలని తన మధ్య వర్తులతో ఒత్తిడి చేస్తున్నారని నవ్య ఆరోపణలు చేశారు. తన భర్తతో సహా ఎమ్మెల్యే రాజయ్యపై పోలీసులకు ఫిర్యాదు చేసినా.. పట్టించుకోలేదని మరోసారి ఫిర్యాదు చేస్తానని నవ్య తెలిపారు.

ఇదిలావుండగా... తెలంగాణ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యపై మహిళా సర్పంచ్‌ లైంగిక ఆరోపణలు (Allegations) తీవ్ర దుమారం లేపిన విషయం తెలిసిందే. ఎమ్మెల్యే రాజయ్య తనను లైంగికంగా వేధిస్తున్నారంటూ హన్మకొండ జిల్లా జానకీపురం సర్పంచ్ నవ్య సంచలన ఆరోపణలు చేసింది. మాట విననందుకు తనపై రాజయ్య లైంగిక వేధింపులకు(Sexual harassment) దిగుతున్నారని నవ్య పేర్కొంది. తనకు ఎమ్మెల్యే కాల్ చేసి బయటకు రమ్మంటున్నారని.. నీ మీద కోరికతోనే పార్టీ టికెట్ ఇచ్చానని వేధిస్తున్నాడని నవ్య ఆరోపించారు. మరోవైపు నవ్య తనపై చేసిన ఆరోపణలను ఎమ్మెల్యే రాజయ్య ఖండించారు.

Updated Date - 2023-06-20T17:59:14+05:30 IST