Youtube: ములుగు జిల్లాకు చెందిన ఈ యువకులు ఏం చేశారో చూడండి..!

ABN , First Publish Date - 2023-09-02T22:29:25+05:30 IST

సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌లో ఉండేందుకు నేటి యువత వీడియోలతో వెర్రి చేష్టలు చేస్తోంది. చట్టాలపై అవగాహన లేకుండా సంచలనం కోసం వారు చేస్తున్న వీడియోలు కేసులకు దారి తీస్తున్నాయి. ఇటువంటి సంఘటనే ములుగు జిల్లాలో చోటు చేసుకుంది.

Youtube: ములుగు జిల్లాకు చెందిన ఈ యువకులు ఏం చేశారో చూడండి..!

యూ ట్యూబ్‌లో వేట వీడియో

కేసు నమోదు చేసిన అటవీ అధికారులు

ములుగు: సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌లో ఉండేందుకు నేటి యువత వీడియోలతో వెర్రి చేష్టలు చేస్తోంది. చట్టాలపై అవగాహన లేకుండా సంచలనం కోసం వారు చేస్తున్న వీడియోలు కేసులకు దారి తీస్తున్నాయి. ఇటువంటి సంఘటనే ములుగు జిల్లాలో చోటు చేసుకుంది. ములుగు మండలం రాయినిగూడెం- కొత్తూరు అటవీప్రాంతంలో అడవికోడిని వేటాడిన ముగ్గురు యువకులు దానిని కాల్చుకుని తిన్నారు. ఏజెన్సీ ప్రాంతంలో అటవీ జంతువులు, పక్షుల వేట కోసం ఉపయోగించే అడపలు (ఉచ్చులాంటి ఆయుధం) సంప్రదాయ ఆయుధంతో వారు అడవి కోడిని వేటాడారు. దీనిని వీడియో చిత్రీకరించి వారు నిర్వహిస్తున్న విలేజ్‌ థింగ్స్‌ యూట్యూబ్‌ చానల్‌లో అప్‌లోడ్‌ చేయగా, 8 వేలకు పైగా వ్యూస్‌ వచ్చాయి.


Thumbnail.jpg

అరుదైన అడవి కోడిని వేటాడడం చట్టరీత్యా నేరం కాగా, ఈ విషయం తెలుసుకున్న ములుగు రేంజ్‌ అటవీ అధికారులు రాయినిగూడెం, కొత్తూరు గ్రామాల్లో విచారణ జరిపారు. పల్లెర్ల శ్రీకాంత్‌, దయ్యాల శ్రీకాంత్‌, గోగు సురేష్‌ అనే ముగ్గురు యువకులు వేటాడినట్లు గుర్తించి వారిపై 1972 అటవీచట్టం కింద కేసు నమోదు చేసినట్లు ములుగు రేంజ్‌ అధికారి శంకర్‌ తెలిపారు.

Updated Date - 2023-09-02T22:29:27+05:30 IST