Telangana news: తాగొచ్చిన భర్తను తాళ్లతో బంధించి భార్య చేసిన పనిది.. తాళలేక మృతి..
ABN , First Publish Date - 2023-09-03T07:56:54+05:30 IST
తాగొచ్చి వేధిస్తున్నాడని ఓ భార్య తన భర్తను అత్యంత దారుణంగా కడతేర్చింది. తాళ్లతో బంధించి చిత్రహింసలకు గురి చేసి హత్య చేసింది. స్థానికంగా కలకలం రేపిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి. మెదక్ జిల్లా తూఫ్రాన్ మండలం ఘణపూర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.
తూఫ్రాన్: తాగొచ్చి వేధిస్తున్నాడని ఓ భార్య తన భర్తను అత్యంత దారుణంగా కడతేర్చింది. తాళ్లతో బంధించి చిత్రహింసలకు గురి చేసి హత్య చేసింది. స్థానికంగా కలకలం రేపిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి. మెదక్ జిల్లా తూఫ్రాన్ మండలం ఘణపూర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. భర్త వెంకటేష్ నిత్యం తాగొచ్చి హింసిస్తున్నాడని భార్య విజయ ఈ హత్యకు పాల్పడింది.
నిత్యం తాగిరావడం, ప్రవర్తనలో ఎలాంటి మార్పూ లేకపోవడంతో భర్త వెంకటేష్‌ను భార్య విజయ తాళ్లతో బంధించింది. కళ్లలో కారం చల్లింది. అంతటితో ఆగకుండా అతడి ఒంటిపై వేడినీళ్లు పోసింది. బాధను తాళలేకపోతున్న అతడిని చూసి పైశాచికి ఆనందం పొందిందని స్థానికులు చెబుతున్నారు. కాగా
స్థానికులు ఇచ్చిన సమాచారం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. తీవ్రంగా గాయపడిన వెంకటేష్‌ను ఆస్పత్రికి తరలించారు. అయినప్పటికీ ఫలితం దక్కలేదు. తూఫ్రాన్ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వెంకటేష్ మృతి చెందాడు. ఈ విషయాన్ని వైద్యులు నిర్ధారించారు. ఈ హత్యకు పాల్పడ్డ భార్య విజయపై పోలీసు కేసు నమోదైంది. సమగ్ర దర్యాప్తు చేపట్టనున్నట్టు పోలీసులు తెలిపారు.