Share News

Yadagirigutta: 28 రోజుల్లో.. రూ.2.38 కోట్ల హుండీ ఆదాయం

ABN , First Publish Date - 2023-12-08T13:46:27+05:30 IST

యాదగిరిగుట్ట(Yadagirigutta) లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఖజానా కు 28రోజుల్లో రూ.2.38కోట్ల హుండీ ఆదాయం లభించింది. గత నెల 9నుంచి ఈ నెల

Yadagirigutta: 28 రోజుల్లో.. రూ.2.38 కోట్ల హుండీ ఆదాయం

- లక్ష్మీనృసింహుడికి ఘనంగా నిత్యారాధనలు

యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట(Yadagirigutta) లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఖజానా కు 28రోజుల్లో రూ.2.38కోట్ల హుండీ ఆదాయం లభించింది. గత నెల 9నుంచి ఈ నెల 6వ తేదీవరకు నృసింహుడిని దర్శించుకున్న భక్తులు హుండీల్లో సమర్పించిన మొక్కు కానుకలను సిబ్బంది గురువారం లెక్కించారు. 28 రోజుల్లో రూ.2,38,46, 282 నగదు, 90గ్రాముల ముడి బంగారం, 3.740 కిలోల మిశ్రమ వెండి భక్తులు సమర్పించగా ఆలయ ఖజానాకు జమ చేశారు. విదేశీ కరెన్సీ రూపంలో 748 అమెరికా డాలర్లు, 670యూఏఈ దిర్హామ్స్‌, 40ఆస్ర్టేలియా డాలర్లు, 150కెనడా డాలర్లు, 80 సింగపూర్‌ డాలర్స్‌, 100 ఇంగ్లండ్‌ పౌండ్స్‌, 21 సౌదీఅరేబియా రియాల్స్‌, 200 శ్రీలంక రూపీలు, 25 యూరప్‌ యూరోలు, 50 కెన్యా షిల్లింగ్స్‌, 200 ఒమన్‌ రియాల్స్‌, 1012 మలేషియా రింగెట్స్‌, ఒకటి కతార్‌రియాల్‌, 10 నేపాల్‌ రూపీలు, 2ఉక్రెయిన్‌ హృనియాలు,240 థాయిలాండ్‌ భట్‌లు సమకూరాయి. కొండకింద సత్యనారాయణస్వామి వ్రతమండపంలో నిర్వహించిన కానుకల లెక్కింపును ఆలయ అనువంశిక ధర్మకర్త నరసింహమూర్తి, ఈవో గీతారెడ్డి పర్యవేక్షించారు.

నృసింహుడికి శాస్త్రోక్తంగా నిత్యారాధనలు

యాదగిరీశుడికి గురువారం నిత్యారాధనలు శాస్ర్తోక్తంగా కొనసాగాయి. ప్రాకార మండపంలో సుదర్శన నారసింహ హోమం, నిత్యతిరుకల్యాణోత్సవం ఆగమ శాస్త్రరీతిలో నిర్వహించారు. శివాలయంలో రామలింగేశ్వరుడికి నిత్యారాధనలు, కొండకింద వ్రతమండంలో సత్యనారాయణస్వామి వ్రతపూజలు శైవాగమ పద్ధతిలో కొనసాగాయి. కార్తీక మాసం సందర్భంగా మహిళా భక్తులు హరిహరుల ఆలయాల ఆవరణలో దీపారాధనలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ ఖజానాకు వివిధ విభాగాల ద్వారా రూ.20,77,049 ఆదాయం సమకూరినట్టు దేవస్థాన అధికారులు తెలిపారు.

Updated Date - 2023-12-08T13:46:29+05:30 IST