Share News

Trending: తాళి కట్టే సమయంలో ఫోన్ రింగ్.. రీల్ సీన్ కాదండోయ్ రియల్ సీనే.. కట్ చేస్తే..

ABN , Publish Date - Mar 21 , 2024 | 03:34 PM

సాధారణంగా సినిమాల్లో విలన్ లేదా చీటర్ ఓ అమ్మాయిని మోసం చేసి పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. ఏర్పాట్లు అన్నీ చేసుకున్నాక సరిగ్గా తాళి కట్టే సమయంలో పోలీసులు ఎంటరై పెళ్లిని ఆపేస్తారు.

Trending: తాళి కట్టే సమయంలో ఫోన్ రింగ్.. రీల్ సీన్ కాదండోయ్ రియల్ సీనే.. కట్ చేస్తే..

సాధారణంగా సినిమాల్లో విలన్ లేదా చీటర్ ఓ అమ్మాయిని మోసం చేసి పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. ఏర్పాట్లు అన్నీ చేసుకున్నాక సరిగ్గా తాళి కట్టే సమయంలో పోలీసులు ఎంటరై పెళ్లిని ఆపేస్తారు. చీటర్ ను పట్టుకుని కటకటాల్లోకి నెడతారు. యువతి జీవితాన్ని కాపాడతారు. ఇలాంటి సీన్లు మనం సినిమాల్లో లెక్కలేనన్ని చూశాం. కానీ నిజ జీవితంలోనూ అలాంటి ఘటనే జరిగింది. సరిగ్గా తాళి కట్టే సమయంలో రింగ్ అయిన ఫోన్ యువతి నిండు జీవితాన్ని కాపాడింది. ఇంతకీ ఆ ఫోన్ ఎవరు చేశారు. ఫోన్ లో ఏం చెప్పారు. పెళ్లి ఆగిపోవడానికి కారణమేంటి.. తెలుసుకోవాలనుకుంటున్నారా.. అయితే ఆలస్యం చేయకుండా వెంటనే ఈ కథనాన్ని చదివేయండి..

కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం రామల్లకోటకు చెందిన యువకుడు విశాఖపట్నంలో ఓ ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. అతనికి అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందిన యువతితో సోషల్ మీడియా ద్వారా పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా సహజీవనానికి దారి తీసింది. యువతి తనను పెళ్లి చేసుకోవాలని కోరడంతో మొహం చాటేసిన ప్రియుడు కర్నూలు జిల్లా కల్లూరుకు చెందిన యువతిని వివాహం చేసుకునేందుకు రెడీ అయ్యి పెళ్లి పీటలకెక్కాడు.

Patanjali: తప్పుడు ప్రకటనల కేసు.. సుప్రీంకోర్టుకు పతంజలి క్షమాపణలు..


సరిగ్గా యువతికి తాళి కట్టే సమయంలో వధువు కుటుంబసభ్యులకు ఫోన్ కాల్ వచ్చింది. తాను, పెళ్లి కొడుకు ఇద్దరం ప్రేమించుకున్నామని, పిల్లలు కూడా ఉన్నారని బాధిత యువతి చెప్పింది. ఫొటోలు, వీడియోలు షేర్ చేసింది. వెంటనే అలర్ట్ అయిన వధువు తల్లిదండ్రులు పెళ్లి ఆపేశారు. మరోవైపు.. ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ పలువురి దగ్గర సదరు పెళ్లి కొడుకు డబ్బులు కూడా తీసుకున్నట్టు ఆరోపణలు ఉండటం గమనార్హం.

BJP: బీజేపీకి బిగ్ షాక్.. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు మాజీ సీఎం ప్రకటన..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Mar 21 , 2024 | 03:34 PM