Share News

Prudhviraj: ఎన్నికల్లో పోటీపై నటుడు పృధ్వీరాజ్ సంచలన కామెంట్స్

ABN , Publish Date - Jan 23 , 2024 | 01:03 PM

Andhrapradesh: వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అంశంపై నటుడు పృధ్వీరాజ్ కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘నేను ఎన్నికల్లో పోటీ చెయ్యను. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వదిలిన బాణం నేను’’ అని అన్నారు.

Prudhviraj: ఎన్నికల్లో పోటీపై నటుడు పృధ్వీరాజ్ సంచలన కామెంట్స్

ప్రకాశం, జనవరి 23: వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అంశంపై నటుడు పృధ్వీరాజ్ కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘నేను ఎన్నికల్లో పోటీ చెయ్యను. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వదిలిన బాణం నేను. మార్చిలో ఎన్నికల ప్రచారానికి వస్తాను. డ్యాన్సులు, సినిమాలు, కలెక్షన్లు, డిస్టిబ్యూటర్ల గురించి మాట్లాడేవాళ్లు మినిస్టర్లా. ప్రాజెక్టుల గురించి అంబటి రాంబాబుకు అసలు తెలుసా. ఎప్పుడైనా ప్రాజెక్టుల గురించి అంబటి రాంబాబు మాట్లాడారా.. ఎప్పుడూ మూడు పెళ్లిలు.. రెండు చోట్ల ఓటమి గురించే మాట్లాడారు’’ అంటూ నటుడు పృధ్వీరాజ్ తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు.


పవన్ పెళ్లిళ్ల వల్ల పోలవరం ఆగిందా?...

‘‘లోకేష్ వద్ద రెడ్ డైరీ ఉంది... నా దగ్గర పీఆర్ డైరీ ఉంది.. ఆ డైరీ బయటకు తీస్తా’’ అంటూ హెచ్చరించారు. పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు చేసుకోవడం వలన పోలవరం ప్రాజెక్టు ఆగిందా... అభివృద్ధి నిలిచిపోయిందా అని ప్రశ్నించారు. మూడు రాజధానుల పేరు చెప్పి.. అసలు రాజధాని లేకుండా చేశారని మండిపడ్డారు. శ్రీకాకుళం దగ్గర నుంచి శ్రీకాళహస్తి వరకు తనను వాడుకుని వదిలేసిన అధికార పార్టీ.. సమాధానం చెప్పే రోజు దగ్గరలోనే ఉందన్నారు.

రాబోయే ఎన్నికల్లో అద్భుతంగా ప్రజల తీర్పు..

వైఎస్ షర్మిల కాంగ్రెస్ వదిలిన బాణం అని అన్నారు. టీడీపీ, జనసేన జెండాల కలయిక స్థిరత్వం, అభివృద్ధి, ప్రజా సంక్షేమానికి పని చేస్తుందన్నారు. 136 స్థానాలతో మిశ్రమ ప్రభుత్వం ఏర్పాటు అవుతుందని... 21 ఎంపీ స్థానాలు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలకు సీట్లు మార్చినంత మాత్రాన ప్రజలు ఓట్లు వేయరన్నారు. 175 సీట్లు గెలుస్తామని చెప్పి ఇప్పుడు భయపడుతున్నారన్నారు. రాబోయే ఎన్నికల్లో ప్రజల తీర్పు అద్భుతంగా ఉంటుందని చెప్పుకొచ్చారు. బూతుల మినిస్టర్లు, బూతుల యూనివర్సీటి కుప్పకూలిపోయే రోజులు దగ్గరలో ఉన్నాయని పృధ్వీరాజ్ వ్యాఖ్యలు చేశారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Powered byPerformoo logo
The video is not available or it's processing - Please check back later.

Updated Date - Jan 23 , 2024 | 02:30 PM